ఎనిమీ మీటింగ్

ఎనిమీ మీటింగ్

ఎన్నికల ప్రచారంలో పరస్పరం తిట్టిపోసుకున్న ట్రంప్, ఒబామా వైట్ హౌస్ లో భేటీ అయ్యారు. అధికార మార్పిడిని సామరస్యంగా జరిపేందుకు వీలుగా ఒబామా ట్రంప్ ను ఆహ్వానించారు. ప్రచారంలో పరస్పరం తీవ్రంగా విమర్శించుకున్న వీరిద్దరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.

ట్రంప్ తో సమావేశం అద్భుతంగా జరిగిందని ఒబామా చెప్పారు. ఒబామా చాలా మంచి మనిషని ట్రంప్ కితాబిచ్చారు. పది నిమిషాలు అనుకున్న మీటింగ్.. 90 నిమిషాలు సాగడమే నిదర్శనమన్నారు. మొత్తం మీద రాజకీయ ప్రత్యర్థులిద్దరీ పరిణతి ప్రద్శించారనే చెప్పాలి.

ట్రంప్ కు అధ్యక్షుడయ్యే యోగ్యతే లేదన్నారు ఒబామా. ఒబామా అమెరికనే కాదన్నారు ట్రంప్. ఇంతస్థాయిలో విద్వేషం వెళ్లగక్కిన తర్వాత కూడా అమెరికా కోసం కలిసి పనిచేస్తామని ఇద్దరూ స్పష్టం చేశారు. ఒబామా పాలసీలపై ఈ భేటీలో చర్చ జరిగింది. వీటివల్ల ఎంత ఉపయోగమో ఒబామా ట్రంప్ కు వివరించారు. అటు ట్రంప్ కూడా బుద్ధిగా ఒబామా చెప్పింది విన్నారు.

గతంలో బుష్ కూడా ఒబామాను ముందే ఆహ్వానించి సాఫీగా పాలన బదిలీ చేశారు. ఇప్పుడు ఒబామా కూడా అలాగే చేస్తున్నారు. మరోవైపు ట్రంప్ ప్రోటోకాల్ ను పక్కనపెట్టడం చర్చనీయాంశమైంది. ప్రత్యేక విమానంలో వచ్చిన ట్రంప్.. తనతో పాటు మీడియాను అనుమతించలేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు