దిల్ రాజు పెద్ద రిస్క్ చేస్తున్నాడే..

దిల్ రాజు పెద్ద రిస్క్ చేస్తున్నాడే..

తమిళనాట దసరా కానుకగా మంచి అంచనాల మధ్య రిలీజైంది 'రెమో' సినిమా. మొదట డివైడ్ టాక్ వచ్చినా ఈ సినిమాకు మంచి కలెక్షన్లే వచ్చాయి. మొత్తానికి హిట్ అనిపించుకుంది. హీరో శివకార్తికేయన్‌కు తెలుగులో అంత మార్కెట్ లేకపోయినా సరే.. ఈ చిత్రాన్ని ఇక్కడ కూడా రిలీజ్ చేయడానికి ఫిక్సయ్యాడు తమిళ నిర్మాత రాజా. అతను శివకార్తికేయన్‌కు ఒకప్పుడు మేనేజర్. ఐతే శివకార్తికేయన్‌ను తెలుగులో లాంచ్ చేయడానికి అగ్ర నిర్మాత దిల్ రాజు సహకారం తీసుకోవడం కలిసొచ్చింది. దిల్ రాజు పేరు పోస్టర్ మీద కనిపించడంతో ఈ సినిమా మీద తెలుగు ప్రేక్షకుల్లోనూ కొంత ఆసక్తి కనిపించింది. పబ్లిసిటీ కూడా కొంచెం పెద్ద ఎత్తునే చేస్తున్నారు.

తాజాగా 'రెమో' రిలీజ్ డేట్ కూడా ఫైనలైజ్‌ చేశారు. ఈ నెల 25న ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తుందట. ఐతే ఆ రోజుకు ఆల్రెడీ పోటీ తీవ్రంగా ఉంది. ఆ రోజు ఇద్దరు కమెడియన్ టర్న్డ్ హీరోలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. శ్రీనివాసరెడ్డి సినిమా 'జయమ్ము నిశ్చయమ్మురా'తో పాటు సప్తగిరి మూవీ 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్' కూడా రిలీజవుతున్నాయి. మరోవైపు మోహన్ లాల్ సినిమా 'మన్యం పులి'ని కూడా ఆ రోజుకే షెడ్యూల్ చేశారు. ఈ శనివారం నుంచి వాయిదా పడ్డ అల్లరి నరేష్ సినిమా 'ఇంట్లో దయ్యం నాకేం భయం' కూడా ఆ రోజే వస్తుందంటున్నారు. మరి ఇంత పోటీ మధ్య 'రెమో'ను తెలుగు ప్రేక్షకులు ఏమాత్రం పట్టించుకుంటారన్నది డౌటు. అయినా దిల్ రాజు రిస్క్ చేయడానికి రెడీ అయిపోయాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English