అమెరికా ఫస్ట్ లేడీ హాట్ అంటున్న వర్మ

అమెరికా ఫస్ట్ లేడీ హాట్ అంటున్న వర్మ

సోషల్ మీడియాలో సెన్సేషనల్ కామెంట్స్ కు రాంగోపాల్ వర్మ పెట్టింది పేరు. ట్విట్టర్ ద్వారా ఆయన చేసే వివాదాస్పద వ్యాఖ్యలకు కొదువలేదు. తాజాగా అమెరికా ఎన్నికల ఫలితాల నేపథ్యంలోనూ వర్మ పోస్ట్ చేసిన కొన్ని మెసేజ్ లు సంచలనమయ్యాయి. అగ్రరాజ్య ప్రస్తుత ప్రథమ దంపతులపై ఆయన చేసిన ఓ కామెంట్ ను జాత్యహంకార ధోరణిలో ఉందని అంతా ధ్వజమెత్తుతున్నారు. ఇంతకీ వర్మ ఏమన్నారంటే, బుధవారం ఎన్నికల ఫలితాలు వెలువడగానే 60ల్లో ఉన్న నిజాయితీ పరుడైన డొనాల్డ్ ట్రంప్ ను అధినేతగా ఎన్నుకున్నందుకు అమెరికన్లకు శుభాకాంక్షలు తెలిపారు. ట్రంప్, అబ్రహాం లింకన్, థియోడర్ రూజ్ వెల్ట్, జాన్ ఎఫ్.కెనడీలను మరిపించే అత్యున్నత అధినేతగా మారతారని వ్యాఖ్యానించారు. ఇక్కడితో ఆగిపోతే ఆయన వర్మ ఎందుకవుతాడు?

తన దృష్టిని బరాక్ ఒబామా, మిషెల్ లపై మళ్లించిన వర్మ, వారు కాస్త సీరియస్ గా ఉన్న ఫొటోలను ట్వీట్ చేసి "ఈ రోజు ఫలితాలు వీరి మొహాలను మరింత నల్లగా మార్చేసి ఉంటాయి" అని పేర్కొన్నారు. మరో ట్వీట్ లో మిషెల్, మెలానియా ట్రంప్ ల చిత్రాలు పెట్టి "ఓ కారణంగా నేను అమెరికా గత ప్రథమ మహిళల కంటే ప్రస్తుత ఫస్ట్ లేడీని ఇష్టపడుతున్నా. ఎందుకో ఎవరైనా చెప్పగలరా?" అని కామెంట్ చేశారు. ఆ ఫొటోలో మెలానియా వైట్ బికినీలో ఉంది. మెలానియా మరో ఫొటోను షేర్ చేస్తూ "జార్జ్ వాషింగ్టన్ కాలం నుంచి చూస్తే అమెరికాకు హాట్ ఫస్ట్ లేడీ దక్కింది" అంటూ మరో మెసేజ్ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ చివర "..అమెరికాను గొప్ప దేశంగా మార్చిన ట్రంప్ కు 1002 ముద్దులు" అని పేర్కొన్నారు. ట్రంప్ గెలుస్తాడని వర్మ నాలుగు నెలల ముందే జోస్యం చెప్పాడట. తన భవిష్యవాణి నిజమవడంతో సన్నిహితులను ఆయన పార్టీ కూడా ఇచ్చాడట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు