అవ‌స‌రాల వేటాడేది ఆమెనే..

అవ‌స‌రాల వేటాడేది ఆమెనే..

ద‌ర్శ‌కుడిగా రెండు మంచి విజ‌యాలందుకున్న‌ప్ప‌టికీ న‌ట‌న‌ను వ‌దిలిపెట్ట‌లేదు అవ‌స‌రాల శ్రీనివాస్‌. ఓ వైపు క్యారెక్ట‌ర్ రోల్స్ చేస్తూనే.. హీరో అవ‌తారం కూడా ఎత్తేస్తున్నాడు. బాలీవుడ్ అడ‌ల్ట్ కామెడీ మూవీ ‘హంట‌ర్‌’ను అవ‌స‌రాల క‌థానాయ‌కుడిగా రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ‘జ్యో అచ్యుతానంద’ భామ రెజీనా కసాండ్రా ఈ సినిమాలో ఓ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. హిందీలో రాధికా ఆప్టే చేసిన పాత్ర‌ను ఆమె చేస్తున్నట్లు స‌మాచారం. ఈ సినిమాలో హీరో గ‌ర్ల్ ఫ్రెండ్ గా మ‌రో కీల‌క పాత్ర కూడా ఉంది. ఈ పాత్ర‌కు తేజ‌స్వి మ‌దివాడ‌ను ఫైన‌లైజ్ చేశారు.

‘హంట‌ర్’ సినిమాలో తాను న‌టిస్తున్న సంగ‌తిని తేజ‌స్వి క‌న్ఫ‌మ్ చేసింది. ఇటీవ‌లే ఫిల్మ్ ప్రొడ‌క్ష‌న్లోకి బ్యాంగ్ బ్యాంగ్ ఎంట్రీ ఇచ్చిన అభిషేక్ పిక్చ‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నవీన్ మేడారం అనే కొత్త ద‌ర్శ‌కుడు ఈ చిత్రంతో ఇండ‌స్ట్రీకి పరిచయమవుతున్నాడు. అవసరాల ఈ చిత్రంలో సెక్స్ అడిక్ట్ పాత్రలో కనిపించబోతుండటం విశేషం. తెలుగులో ఈ త‌ర‌హా అడ‌ల్ట్ కామెడీలు అరుదే. ఐతే ఈ మ‌ధ్య ప్రేక్ష‌కుల టేస్టు మారుతోంది. ఇలాంటి సినిమాల్ని బాగానే రిసీవ్ చేసుకుంటార‌న్న న‌మ్మ‌కంతో ‘హంట‌ర్‌’ను రీమేక్ చేస్తున్నారు. హంట‌ర్‌లోని బోల్డ్ సీన్స్.. అడ‌ల్ట్ కామెడీని తెలుగు నేటివిటీకి త‌గ్గ‌ట్లుగా ఎలా తీర్చిదిద్దుతార‌న్న‌ది కీల‌కం. ‘విక్కీ డోన‌ర్’ రీమేక్ ‘న‌రుడా డోన‌రుడా’ తేడా కొట్టేసిన నేప‌థ్యంలో ‘హంట‌ర్’ విష‌యంలో జాగ్ర‌త్తగా ఉండాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు