రెడ్డి గారికి పంచ్ పడిందిగా..

రెడ్డి గారికి పంచ్ పడిందిగా..

ఈ శుక్ర‌వారం అక్కినేని నాగ‌చైత‌న్య సినిమా 'సాహ‌సం శ్వాస‌గా సాగిపో' మంచి అంచ‌నాల మ‌ధ్య విడుద‌ల‌వుతోంది. దీంతో పాటు అల్ల‌రి న‌రేష్ సినిమా 'ఇంట్లో ద‌య్యం నాకే భ‌యం' కూడా వ‌స్తోంది. ఆ త‌ర్వాతి వారానికి మాత్రం పోటీనే లేన‌ట్లుగా క‌నిపించింది. అలాంటి టైంలో త‌మిళ డ‌బ్బింగ్ సినిమాలు 'బేతాళుడు'.. 'ఒక్క‌డొచ్చాడు' రేసులోకి వ‌చ్చాయి. త‌ర్వాత తెలుగు నుంచి క‌మెడియ‌న్ ట‌ర్న్డ్ హీరో శ్రీనివాస‌రెడ్డి సినిమా 'జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా' పోటీకి దిగింది. త‌మిళ అనువాదాల‌తో గ‌ట్టి పోటీ ఉన్నా.. పాజిటివ్ బ‌జ్ ఉన్న నేప‌థ్యంలో శ్రీనివాస‌రెడ్డి సినిమా నెట్టుకొచ్చేస్తుంద‌నే అనుకున్నారంతా.

కానీ స‌డెన్ గా 18న విడుద‌ల‌కు సిద్ధ‌మైపోయింది నిఖిల్ సినిమా 'ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా. 11నే అనుకున్న ఈ సినిమా 'సాహ‌సం శ్వాస‌గా సాగిపో' కార‌ణంగా వాయిదా ప‌డింది. 18కి పోటీ ఎక్కువ‌గా ఉన్నా.. క్రేజ్ ఎక్కువగా ఉన్న‌ది త‌మ సినిమాకే కాబ‌ట్టి ధైర్యంగా రిలీజ్ డేట్ ఇచ్చేశారు. దీంతో దెబ్బ శ్రీనివాస‌రెడ్డి సినిమాకు ప‌డింది. త‌మిళ అనువాదాలు రెండు భాష‌ల్లో విడుద‌ల కావాల్సిన‌వి కాబ‌ట్టి డేట్ మార్చ‌డానికి వీల్లేదు. మూడు సినిమాల‌తో పోటీ ప‌డితే ఇబ్బంది త‌ప్ప‌ద‌ని భావించి.. 'జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా'ను వాయిదా వేసేశారు. ఈ సినిమాకు సెన్సార్ కూడా పూర్త‌యింది. క్లీన్ యు స‌ర్టిఫికెట్ ఇచ్చారు. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రం న‌వంబ‌రు 25న రిలీజ‌వుతుంద‌ట‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు