అరవ డబ్బింగ్ పైత్యం చూడండి

అరవ డబ్బింగ్ పైత్యం చూడండి

ఒక తమిళ హీరోకు తెలుగులో కాస్త పేరొచ్చిందంటే చాలు.. ఇక అతడి పాత, కొత్త సినిమాలన్నింటినీ తెలుగులోకి దించేయడం మన డబ్బింగ్ నిర్మాతలకు అలవాటు. ఈ క్రమంలో తమిళంలో సినిమా ఆడిందా లేదా అన్నది కూడా పట్టించుకోరు. కళ్లు మూసుకుని అనువాదం చేసి రిలీజ్ చేసేస్తారు. 'రంగం' సినిమాతో జీవా తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాక అతడి సినిమాలు వరుసబెట్టి తెలుగులోకి దించేశారు. 'రంగం' కంటే ముందు ఎప్పుడెప్పుడో వచ్చిన జీవా సినిమాల్ని కూడా తెలుగులోకి తెచ్చేశారు. వాటితో పాటు కొత్త సినిమాలు కూడా బోల్తా కొట్టేశాయి. జీవా సినిమా అంటేనే జనాలు పట్టించుకోని పరిస్థితి వచ్చేసింది.

తాజాగా 'యాన్' అనే ఫ్లాప్ మూవీని 'రంగ-2' పేరు చెప్పి రిలీజ్ చేస్తున్నాడు ఓ నిర్మాత. ఇదే టూమచ్ అంటే.. 'పోకిరి రాజా' పేరుతో రాబోతున్న మరో సినిమా మరీ టూమచ్. ఎందుకంటే 'పోకిరి రాజా' తమిళంలో మామూలు డిజాస్టర్ కాదు. జీవా కెరీర్లోనే అత్యంత చెత్త చిత్రాల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది. అసలే జీవా మార్కెట్ పూర్తిగా దెబ్బ తినేసి ఉంటే.. ఇక 'పోకిరి రాజా' లాంటి సినిమాను తెలుగులోకి తేవడంలో ఔచిత్యమేంటి? డబ్బింగ్ ఖర్చులు.. థియేటర్ల రెంట్లు వృథా తప్పితే ఇలాంటి సినిమాల వల్ల ప్రయోజనం ఉండదు. సినిమా ఎలా ఉందో చూసుకోకుండా ఇలా దొరికిన సినిమాను దొరికినట్లు డబ్ చేసి రిలీజ్ చేయడం వల్లే.. గత కొన్నేళ్లలో తమిళ డబ్బింగ్ మార్కెట్ బాగా దెబ్బ తింది. అయినా ఈ జనాల్లో మార్పు రావట్లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు