సప్తగిరీ.. సునీల్‌ను ఓసారి చూసుకోమ్మా!

సప్తగిరీ.. సునీల్‌ను ఓసారి చూసుకోమ్మా!

కమెడియన్లు హీరోలవడం కొత్తేం కాదు. ఒకప్పుడు బ్రహ్మానందం.. అలీ కూడా హీరోలుగా అదృష్టం పరీక్షించుకున్నారు. కానీ వాళ్లు ఆ సినిమాల్లో పెద్దగా 'హీరోయిజం' చూపించింది లేదు. ఆలీ కొంచెం హీరోయిజం చూపించాడు కానీ.. అది కామెడీగానే ఉండేది. ఐతే సునీల్ హీరోగా మారాక మాత్రం సీన్ మారింది. అతను కామెడీ హీరోలా కాకుండా మాస్ హీరో లాగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేశాడు. అందాల రాముడు, మర్యాదరామన్న వరకు బాగానే ఉన్నాడు కానీ.. 'పూలరంగడు'కు వచ్చేసరికి సీన్ మారిపోయింది. ఆ సినిమా ఆడింది కదా అని.. వరుసగా ఊర మాస్ వేషాలు వేస్తూ వచ్చాడు. కానీ అక్కడే జాతకం తిరగబడింది. ఇప్పుడు అటు కామెడీకి.. ఇటు హీరోయిజానికి.. రెంటికీ చెడి జంక్షన్లో నిలబడ్డాడు.

ఇప్పుడీ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే తాజాగా మరో కమెడియన్ సప్తగిరి సైతం హీరోగా మారాడు. 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్' పేరుతో సినిమా చేశాడు. దాని ట్రైలర్ తాజాగా రిలీజైంది. సప్తగిరి హీరోగా ఎలా కనిపిస్తాడా అని అంతా ఎదురు చూశారు. ఇందులో అతడి మార్కు కామెడీ కనిపించింది కానీ.. దీనికి తోడు సునీల్ తరహాలో తన హీరోయిజం చూపించే ప్రయత్నం కూడా చేసినట్లున్నాడు. వీర లెవెల్లో ఫైట్లు చేశాడు.. పిచ్చ పిచ్చగా డ్యాన్సులు కూడా చేశాడు. కానీ ఇలాంటి ఫీట్లు సప్తగిరికి ఏమాత్రం సూటవుతాయన్నదే సందేహం. ఆ ఫైట్లు సినిమాలో ఏ సందర్భంలో వస్తాయి.. ఎంత సీరియస్‌గా ఉంటాయన్నది ఇక్కడ కీలకమైన విషయం. ఏదో ఫన్నీ ఫైట్లయితే ఓకే కానీ.. మరీ సీరియస్‌గా చేస్తేనే తేడా కొట్టేస్తుంది. రెగ్యులర్ మాస్ హీరోల్లా డ్యాన్సులు చేసినా కష్టమే. కాబట్టి సప్తగిరి కొంచెం జాగ్రత్తగా అడుగులేస్తే బెటర్.

Saptagiri Express Trailer

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు