పాత వాళ్లందరినీ తీసుకొస్తున్న చిరు

పాత వాళ్లందరినీ తీసుకొస్తున్న చిరు

లెజెండరీ రైటర్స్ పరుచూరి సోదరులు లైమ్ లైట్లోంచి వెళ్లిపోయి చాలా కాలం అయిపోయింది. వాళ్లిద్దరితో పని చేయడానికి ఇప్పటి దర్శకులు అసలు ఆసక్తి చూపించట్లేదు. కానీ మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఒకప్పుడు తనకు బ్లాక్ బస్టర్ హిట్లు అందించిన ఆ ఇద్దరు రచయితల్నే పట్టుబట్టి తన కొత్త సినిమా ‘ఖైదీ నెంబర్ 150’ కోసం తీసుకొచ్చాడు. ఈ సినిమా స్క్రిప్టు విసయంలో వేరే రచయితల హ్యాండ్స్ కూడా ఉన్నప్పటికీ పోస్టర్ల మీద కనిపించేది వీళ్ల పేర్లే.

మరోవైపు ఒకప్పుడు తన సినిమాలకు అద్భుతమైన కొరియోగ్రఫీ చేసిన లారెన్స్‌ను సైతం ఈ సినిమా కోసం రప్పించాడు చిరు. కొన్నేళ్లుగా కొరియోగ్రఫీ పక్కనబెట్టేసి.. నటుడిగా, దర్శకుడిగా బిజీ అయిపోయిన లారెన్స్.. తనకు లైఫ్ ఇచ్చిన చిరు కోసం మళ్లీ కొరియోగ్రాఫర్ అవతారం ఎత్తాడు. విశేషం ఏంటంటే.. చిరు ఇప్పుడు తన పాత రోజుల్లో పని చేసిన మరో టెక్నీషియన్‌ను ‘ఖైదీ నెంబర్ 150’ కోసం పిలిపించాడు. అతనే ఫైట్ మాస్టర్ కణల్ కణ్ణన్.

90ల్లో కణల్ కణ్ణన్ ఊపు మామూలుగా ఉండేది కాదు. ఇటు తెలుగులో.. అటు తమిళంలో భారీ సినిమాలు చేసేవాడు కణల్. ఐతే తర్వాత తర్వాత అతడికి సినిమాలు తగ్గిపోయాయి. ఇప్పుడు చాలా వరకు ఖాళీ అయిపోయిన కణల్‌ను తన సినిమా కోసం రప్పించాడు చిరు. ఈ సినిమాకు ఆల్రెడీ రామ్-లక్ష్మణ్‌లను ఫైట్ మాస్టర్లుగా పెట్టుకున్నాడు వినాయక్. ఐతే క్లైమాక్స్ ఫైట్ కోసం మాత్రం ప్రత్యేకంగా కణల్‌ను రప్పించారు. ఈ ఫైట్ భారీగా డిజైన్ చేశారట. కణల్ అయితే కొంచెం వెరైటీగా చేస్తాడని అతడికి బాధ్యతలు అప్పగించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు