పవన్‌తో ఎవరా ఇద్దరు?

పవన్‌తో ఎవరా ఇద్దరు?

నాలుగు నెలల వ్యవధిలో మూడో సినిమా మొదలుపెట్టేశాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. త్రివిక్రమ్ దర్శకత్వం వహించే ఈ సినిమా వచ్చే నెలలోనే సెట్స్ మీదికి వెళ్లబోతోంది. ఈ లోపు నటీనటుల ఎంపిక మీద దృష్టిపెట్టనున్నారు. పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన రెండు సినిమాల్లో లాగే ఇందులో కూడా ఇద్దరు హీరోయిన్లు నటిస్తారట. ఆ హీరోయిన్లెవరన్నది ఇంకా తేలలేదు. ఐతే ఈ సినిమాకు హీరోయిన్ల ఎంపిక అంత సులువుగా తెగే వ్యవహారంలాగా లేదు. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో హీరోయిన్ల కొరత బాగా ఉంది. ముఖ్యంగా స్టార్ హీరోలకు హీరోయిన్లను సెట్ చేయడం చాలా కష్టమైపోతోంది.

ఉన్న స్టార్ హీరోయిన్లు తక్కువమంది. కొత్తవాళ్లను తీసుకుందామంటే స్టార్ హీరోల స్టేచర్‌కు సరిపోతారా లేదా అన్న డౌటు. ఇప్పుడున్న స్టార్ హీరోయిన్లలో సమంత.. ఇప్పటికే త్రివిక్రమ్ గత మూడు సినిమాల్లోనూ కథానాయికగా నటించింది. మళ్లీ ఆమెతో అంటే మొనాటనీ వచ్చేస్తుంది. ఈ సినిమాకు ఆమె ఒక కథానాయికగా నటిస్తోందని ప్రచారం జరిగింది కానీ.. సమంతే స్వయంగా అది అబద్ధమని తేల్చేసింది. ఇక కాజల్.. ఆల్రెడీ ‘సర్దార్ గబ్బర్ సింగ్’లో నటించింది. వెంటనే ఆమెతో పవన్ సినిమా చేయడేమో. తమన్నా ఈ మధ్య ఎక్కువగా తమిళ సినిమాలపై ఫోకస్ పెట్టింది. ‘కెమెరా మన్ గంగతో రాంబాబు’లో పవన్-తమన్నా జోడీ అంతగా కుదిరినట్లు కనిపించలేదు. ఇక శ్రుతి హాసన్‌ను చూద్దామంటే ఆల్రెడీ ‘కాటమరాయుడు’లో చేస్తోంది. ఇక స్టార్ స్టేటస్ ఉన్నవాళ్లలో మిగిలిన ఛాయిస్ రకుల్ ప్రీత్ సింగే. ఆమె తీరిక లేకుండా సినిమాలు చేస్తోంది. డేట్లు కేటాయించడం కష్టమే. నయనతార.. నీశన్ దర్శకత్వంలో పవన్ చేయబోయే సినిమాలో కథానాయిక అంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో త్రివిక్రమ్ పవన్ కోసం ఒకరికి ఇద్దరు హీరోయిన్లను ఎక్కడి నుంచి పట్టుకొస్తాడో చూడాలి.