చైతూ సెంటిమెంటును బద్దలు కొడతాడా?

చైతూ సెంటిమెంటును బద్దలు కొడతాడా?

మామూలుగా ఒక సినిమా అనుకున్న సమయానికి విడుదల కాకుండా కాస్త వాయిదా పడిందంటే చాలు.. ఆ సినిమా మీద నెగెటివ్ ఇంపాక్ట్ పడిపోతుంది. అందులోనూ నెలలు సంవత్సరాలు వాయిదా పడి.. అసలు ఎప్పుడు విడుదలవుతుందో తెలియకుండా.. అసలు విడుదలవుతుందో లేదో తెలియకుండా అయోమయం నెలకొందంటే ఇక ఆ సినిమా సంగతి అంతే అని వదిలేస్తారు జనాలు. ఒక వేళ విడుదలకు సిద్ధం చేసినా.. అది ఫ్లాప్ అని ముందే ఓ నిర్ణయానికి వచ్చేస్తారు. ఐతే నాగచైతన్య సినిమా 'సాహసం శ్వాసగా సాగిపో' విషయంలో మాత్రం జనాల్లో ఆ ఫీలింగ్ లేదు.

ఏడాది కిందట విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడి ఎట్టకేలకు వచ్చే శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొచ్చేస్తోంది. ఐతే కాంబినేషన్ క్రేజ్.. ప్రోమోలు.. ఆడియో ఇచ్చిన పాజిటివ్ ఫీలింగ్ వల్ల ఈ సినిమా మీద మంచి అంచనాలతోనే ఉన్నారు ప్రేక్షకులు. పైగా చైతూ లేటెస్ట్ మూవీ 'ప్రేమమ్' కూడా హిట్ కావడంతో 'సాహసం శ్వాసగా సాగిపో' మీద పాజిటివ్ బజ్ ఉంది. గౌతమ్ మీనన్ ఇప్పటిదాకా చేసిన సినిమాలన్నీ తెలుగు ప్రేక్షకుల్ని చాలా వరకు ఆకట్టుకున్నాయి. ఆయన సినిమాలు ఎప్పుడైనా అంచనాల్ని అందుకోలేకపోయి ఉండొచ్చు కానీ.. తీసి పడేసేలా మాత్రం ఉండవు. ఇక 'ఏమాయ చేసావె'కు ఎక్స్టెన్షన్ తరహాలో చైతూ కాంబినేషన్లో గౌతమ్ చేసిన 'సాహసం శ్వాసగా సాగిపో' మొదట్నుంచి ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో చాలా వాయిదాల తర్వాత వచ్చే సినిమాలు ఆడవన్న సెంటిమెంటును చైతూ బద్దలు కొట్టేస్తాడేమో చూద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు