ఐశ్వర్యరాయ్ సినిమా చూళ్లేదు - అభిషేక్

ఐశ్వర్యరాయ్ సినిమా చూళ్లేదు - అభిషేక్

కరణ్ జోహార్ తెరకెక్కించిన 'యే దిల్ హై ముష్కిల్' కాసుల పంట పండిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రూ.169.26కోట్లు కలెక్ట్ చేసి చిత్రబృందాన్ని ఆనందంలోకి నెట్టింది. చాలాకాలం తర్వాత రణ్‌బీర్‌ కపూర్‌, ఐశ్వర్యరాయ్ లు ఈ చిత్రం ద్వారానే హిట్ అందుకున్నారు. ప్రేమ, భావోద్వేగాల సమాహారంగా సాగిన ఈ సినిమాలో రణ్‌బీర్‌‌, ఐశ్వర్యల కెమిస్ట్రీపై మొదట్నుంచీ చర్చ నడిచింది. ఈ అంశమే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కుటుంబంలో చిచ్చు రేపిందన్న వార్తలూ తెరపైకి వచ్చాయి. దానికి తగ్గట్టే చిత్ర ప్రీమియర్ షోకు ఆ ఫ్యామిలీకి చెందినవారెవరూ కనిపించలేదు. బిగ్ బీ కూడా మీడియాతో గానీ, ట్విట్టర్ లో గానీ ఎలాంటి కామెంట్ చేయలేదు. దీంతో ఐష్ తీరుపై బచ్చన్స్ అసంతృప్తితోనే ఉన్నారని అనుకున్నారంతా. అయితే, 'ధూమ్-2' స్టార్ తన ఫ్యామిలీ కోసం ప్రత్యేకంగా 'యే దిల్ హై ముష్కిల్' షో వేయించిందని, అభ్యంతరకర సీన్లేవీ లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారని చెప్పుకున్నారు. ఈ టాపిక్స్ సంగతెలా ఉన్నా.. 'యే దిల్ హై ముష్కిల్'ను అభిషేక్ బచ్చన్ ఇప్పటివరకూ చూడలేదట. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించాడు.

సోదరి శ్వేతా నందా ర్యాంప్ వాక్ చేసిన ఫ్యాషన్ షోకు వచ్చిన అభిషేక్ కు  'యే దిల్ హై ముష్కిల్' గురించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. లేటెస్ట్ పిక్చర్ లో తన భార్య ఐశ్వర్య ఫర్ఫార్మెన్స్ గురించి చెప్పమన్న ఓ విలేకరి ప్రశ్నకు అభిషేక్ "నిజం చెప్పాలంటే ఆమెను చూసి నేను గర్విస్తున్నా. 'యే దిల్ హై ముష్కిల్'ను నేను ఇప్పటివరకూ చూడలేదు. నా సినిమాతో చాలా బిజీగా ఉన్నాను. అయితే, 'యే దిల్ హై ముష్కిల్' రషెస్ చూశాను, సెట్స్ లో ఏమేం జరిగేదో ఐశ్వర్య ఎప్పటికప్పుడు నాకు చెప్తూనే ఉండేది" అని తెలిపాడు. దీపావళికి ముందు విడుదలై బాక్సాఫీస్ వద్ద హల్ చల్ చేస్తున్న ఈ చిత్రాన్ని, అందులోనూ సతీమణి నటించిన సినిమాను అభిషేక్ ఇప్పటికీ చూడకపోవడం ఆసక్తికరమే. ఆ సినిమాలో ఏం చూడాల్సి వస్తుందోనన్న భయంతో స్మాల్ బీ 'యే దిల్ హై ముష్కిల్'కు దూరంగా ఉన్నాడో ఏంటో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు