మనోజ్ డైరెక్టర్.. ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ

మనోజ్ డైరెక్టర్.. ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ

మంచు మనోజ్ కొత్త సినిమా ‘ఒక్కడు మిగిలాడు’ ఇండస్ట్రీలో బాగానే ఆసక్తి రేకెత్తిస్తోంది. మొదట్నుంచి కొంచెం వైవిధ్యమైన సినిమాలే చేస్తూ వస్తున్నాడు మనోజ్. ‘ఒక్కడు మిగిలాడు’లో అతను తమిళ టైగర్ ప్రభాకరన్ పాత్ర పోషిస్తున్నాడన్న సమాచారం ఆసక్తి రేకెత్తిస్తోంది. తెలుగులో తీవ్రవాదం నేపథ్యంలో మంచి ఇంటెన్సిటీ ఉన్న సినిమాలు వచ్చి చాలా కాలమైపోయింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయి అంశాన్ని తీసుకుని కొత్త దర్శకుడు అజయ్ ఆండ్రూస్ నూతక్కి ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో జనాల్లో క్యూరియాసిటీ పెరిగింది.

ఈ దర్శకుడి కెరీర్ నేపథ్యం ఆసక్తికరమైంది. అతను తెలుగువాడే అయినప్పటికీ తమిళంలో దర్శకుడిగా పరిచయమయ్యాడు. అక్కడ ‘రావణదేశం’ అనే సినిమా చేశాడు. అది శ్రీలంకలోని తమిళ శరణార్థుల గురించి తీసిన సినిమా. అతడికి ఈ అంశంపై బాగా పట్టు.. ఆసక్తి ఉన్నట్లుంది. అందుకే తెలుగులో కూడా మళ్లీ తమిళ టైగర్లు.. తమిళ శరణార్థుల కథనే ఎంచుకున్నాడు. ఒకవేళ అతను తీసిన తమిళ సినిమాకు ఇది రీమేక్ అయినా అయ్యుండొచ్చేమో. విశేషం ఏంటంటే.. ఈ సినిమాకు అజయ్ దర్శకుడు మాత్రమే కాదు.. ఇందులో అతను ఓ కీలక పాత్ర కూడా చేస్తున్నాడు. శనివారం అజయ్ పుట్టిన రోజు సందర్భంగా అతడికి విషెస్ చెబుతూ ఓ పిక్ కూడా షేర్ చేశాడు మనోజ్. హీరో పక్కన గన్ను పట్టుకుని గడ్డంతో ఉన్న వ్యక్తే అజయ్ ఆండ్రూస్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English