ఫస్టాఫ్ 20 రోజుల్లో.. సెకండాఫ్ ఏడాదిన్నర

ఫస్టాఫ్ 20 రోజుల్లో.. సెకండాఫ్ ఏడాదిన్నర

‘కాష్మోరా’ సినిమాకు మామూలు కష్టం పడలేదంటున్నాడు కార్తి. ముఖ్యంగా ఈ చిత్రంలో ద్వితీయార్ధం తెరకెక్కించడానికి చాలా కష్టం.. సమయం అవసరమైందన్నాడు కార్తి. ‘‘కాష్మోరా సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచిన విజువల్ ఎఫెక్ట్స్.. గ్రాఫిక్స్ కోసం చాలా కష్టపడ్డాం. చిత్రీకరణ కూడా చాలా కష్టమైంది. ప్రథమార్ధాన్ని కేవలం 20 రోజుల్లోనే పూర్తి చేసేశాం. కానీ ద్వితీయార్ధానికి ఏడాదిన్నర పైగానే పట్టింది. అందుకే సినిమా మొదలైన రెండేళ్లకు కానీ విడుదల కాలేదు. మేం ముందు అనుకున్న ప్రకారం అయితే త్వరగా పూర్తయ్యేదే. కానీ ‘బాహుబలి’ చూశాక షూటింగ్ ఆపి.. మరింత క్వాలిటీతో సినిమా చేయాలని భావించి ప్రణాళికలు మార్చుకున్నాం. ఇప్పుడు మా కష్టానికి తగ్గ ఫలితం వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని కార్తి తెలిపాడు.

ఇక సినిమాకు వస్తున్న రెస్పాన్స్ గురించి కార్తి చెబుతూ.. ‘‘ఇలాంటి ఆదరణను ఊహించలేదు. ఇది రెగ్యులర్‌ కాన్సెప్ట్‌ మూవీ కాదు. హర్రర్‌కు కామెడినీ జోడించడంతో ప్రథమార్ధంలో అందరూ నవ్వుతున్నారు. ద్వితీయార్ధంలో థ్రిల్లవుతున్నారు. హిస్టారికల్‌ పార్ట్‌, రాజ్‌నాయక్‌ పాత్రను ప్రేక్షకులు బాగా రిసీవ్‌ చేసుకున్నారు. రాజ్‌ నాయక్‌ క్యారెక్టర్‌కు తల లేకుండా చూపించడం చిన్న విషయం కాదు. అన్నయ్య సూర్య ప్రేక్షకుల మధ్య కూర్చుని ఈ సినిమా చూశారు. ఇంటర్వెల్‌ బ్లాక్‌లో బాగా నవ్వారు. ఈ మధ్యకాలంలో ఇంతలా ఎప్పుడూ నవ్వలేదురా అన్నాడు. ద్వితీయార్ధంలో చాలా థ్రిల్లయ్యారు. సినిమా చూశాక యూనిట్ మొత్తాన్ని అభినందిస్తూ ఒక పెద్ద లెటర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు’’ అని కార్తి తెలిపాడు. మణిరత్నం దర్శకత్వంలో తాను చేస్తున్న తర్వాతి సినిమా ఎనిమిది రోజుల చిత్రీకరణ మినహా పూర్తయిందని కార్తి తెలిపాడు. అందులో తనది మిలటరీ ఆఫీసర్‌ పాత్ర అని చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English