బావ కోసం చైతూ క్యామియో చేశాడు

బావ కోసం చైతూ క్యామియో చేశాడు

తన ఫ్యామిలీ హీరోల కోసం అక్కినేని నాగచైతన్య బాగానే సపోర్టిస్తున్నాడు. ఈ మధ్యే తన బావ సుశాంత్ హీరోగా నటించిన ‘ఆటాడుకుందాం రా’ సినిమాలో ఒక చిన్న క్యామియో రోల్ లో కనిపించాడు చైతూ. ఇప్పుడు ఇంకో బావ సుమంత్ కోసం చైతూ తనవంతు సాయం చేస్తున్నాడు. సుమంత్ కొత్త సినిమా ‘నరుడా డోనరుడా’లో చైతూ క్యామియో రోల్ చేయడం విశేషం. ఈ సినిమా చివర్లో చైతూ ఓ సర్ప్రైజింగ్ రోల్ లో కనిపిస్తాడు. ఆ పాత్ర భలే ఫన్నీగా ఉంటుందని సమాచారం.

మరోవైపు చైతూ తండ్రి నాగార్జున సైతం ఈ సినిమా కోసం ఓ చిన్న సాయం చేశారు. సినిమా మొదట్లో ఆయన ఈ సినిమా ఉద్దేశమేంటో తెలియజేస్తారు. వీర్య దానం ప్రాధాన్యం గురించి చెబుతూ.. దాని మీద అవగాహన కలిగించడానికే మా ఈ సినిమా అంటూ మెసేజ్ ఇస్తారు. ఈ సినిమాలో నాగార్జున కూడా నిర్మాణ భాగస్వామి అన్న సంగతి తెలిసిందే.

సరైన హిట్టు లేక.. పైగా కెరీర్లో బాగా గ్యాప్ కూడా వచ్చేసిన నేపథ్యంలో ‘నరుడా డోనరుడా’ హిట్టవడం సుమంత్ కు అత్యావశ్యకం. ఐతే ఈ సినిమా మీద ఇండస్ట్రీల్లో.. ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. బాలీవుడ్ మూవీ ‘విక్కీ డోనర్’ను తెలుగైజ్ చేయడంలో ‘నరుడా డోనరుడా’ టీం బాగానే సక్సెస్ అయ్యిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా విడుదల విషయంలో తలెత్తిన చిన్న ఇబ్బందులు సమసిపోయి.. ఈ రోజే ఈ సినిమా రిలీజవుతుందని సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English