పవన్‌కళ్యాణ్‌తో పరాచికాలొద్దు!

పవన్‌కళ్యాణ్‌తో పరాచికాలొద్దు!

పవన్‌కళ్యాణ్‌ సినిమాల్లో భారీ కథలుండాలని, కళ్లు చెదిరే గ్రాఫిక్స్‌ వుండాలని, అందమైన లొకేషన్లు, అద్భుతమైన నిర్మాణ విలువలు వుండాలని ఎవరూ కోరుకోరు. పవర్‌స్టార్‌ ఎనర్జిటిక్‌గా కనిపిస్తూ, చూడ్డానికి సినిమా సరదాగా వుంటే చాలు, అదే బ్రహ్మాండమైన హిట్‌ అయిపోతుంది. నిజానికి మిగతా హీరోల కంటే పవన్‌తో సినిమా తీయడమే చాలా ఈజీ. కానీ ఇది విస్మరించి అతనితో ఏవేవో చేయించాలని చూసి చాలా మంది చేతులు కాల్చుకున్నారు. ఏ హీరోతో ఏమి చేస్తే ఆడియన్స్‌ చూస్తారనే సంగతి త్రివిక్రమ్‌కి బాగా తెలుసు. అందుకే పవన్‌తో అతను రెండు వరుస హిట్లు కొట్టాడు.

ఇప్పుడు వారి కాంబినేషన్‌లో మూడో సినిమా అనగానే ఇదేదో చాలా అద్భుతంగా వుండబోతుందంటూ, రొటీన్‌కి భిన్నం అంటూ మీడియా ఊహించేస్తోంది. కానీ అలాంటి ప్రయోగాలు చేసేంత అమాయకత్వం త్రివిక్రమ్‌లో లేదు. అందుకే పవన్‌ కోసం అతనో సింపుల్‌ కథని సిద్ధం చేస్తున్నాడు. అత్తారింటికి దారేది మాదిరిగా కాస్త ఎమోషన్‌, బోలెడంత వినోదం వుండే కథ ఇది. ఒక మామూలు సినిమా తీస్తేనే పవన్‌ ఇండస్ట్రీ హిట్‌ చేసేసాడు కనుక ఈసారి వినోదం, డైలాగులు అన్నీ బాగుండేలా త్రివిక్రమ్‌ జాగ్రత్త తీసుకుంటున్నాడట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు