కారిచ్చాడు.. హిట్టని ఒప్పుకోండి

కారిచ్చాడు.. హిట్టని ఒప్పుకోండి

ఈ మధ్య హీరోకు నిర్మాతో.. దర్శకుడికి హీరోనో.. లేదా దర్శకుడికి నిర్మాతో ఖరీదైన కార్లు బహుమతిగా ఇవ్వడం ఆనవాయితీగా మారుతోంది. 'శ్రీమంతుడు' సినిమా విజయానంతరం దర్శకుడు కొరటాల శివకు మహేష్ బాబు లగ్జరీ కారు గిఫ్టిస్తే.. 'భలే భలే మగాడివోయ్' సినిమాకు కాను మారుతికి అల్లు అరవింద్ అలాంటి గిఫ్టే ఇచ్చాడు. ఈ మధ్య అల్లు శిరీష్ కు కూడా అరవింద్ కారు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇలా కారు గిఫ్టుగా ఇస్తే ఆ సినిమా సూపర్ హిట్టని.. ఆ ఆనందంలో గిఫ్ట్ ఇస్తున్నారని అర్థమన్నమాట. ఈ కోవలోనే మల్టీ టాలెంటెడ్ ప్రభుదేవా కూడా దర్శకుడు ఎ.ఎల్.విజయ్కు ఓ లగ్జరీ ఆడి కారు బహుమతిగా ఇచ్చాడు.

ప్రభుదేవా-విజయ్ కాంబినేషన్లో దసరాకు 'అభినేత్రి' సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ప్రభుదేవానే నిర్మాత. ఐతే మూడు భాషల్లో రిలీజైన ఈ చిత్రం తమిళంలో మాత్రమే ఓ మోస్తరుగా ఆడింది. తెలుగులో.. హిందీలో ఓ మోస్తరుగా ఆడిందంతే. అయినప్పటికీ ఈ సినిమా సూపర్ హిట్ అని చెప్పుకోవడానికి కాను ప్రభుదేవా.. విజయ్కు కారు గిఫ్టిచ్చినట్లున్నాడు. కాకపోతే మూడు భాషల్లో రిలీజ్ చేయడం వల్ల ఈ సినిమాకు కొంత వరకు లాభాలైతే అందాయి. బడ్జెట్ 70 కోట్లంటూ అతి చేసి చెప్పారు కానీ.. ఆ సినిమాకు అంత అయ్యే సీన్ లేదు. ఓ 30-40 కోట్ల మధ్య ముగించేసి ఉండొచ్చు. అమ్మకాలైతే రూ.50 కోట్లను దాటినట్లు సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English