సునీల్‌ కెలకడం మానుకోవాలి!

సునీల్‌ కెలకడం మానుకోవాలి!

హీరో అయిన కొత్తల్లో అదరగొట్టిన సునీల్‌ రేంజ్‌ నానాటికీ పడిపోతోంది. వరుసపెట్టి నాసి రకం సినిమాలు చేసిన ఎఫెక్టు అతని రీసెంట్‌ సినిమా వసూళ్ల మీద బాగా కనిపించింది. దర్శకుల పని సరిగా చెయ్యనివ్వడని, తనకి నచ్చినట్టుగా తీయమని వారిని ముప్పుతిప్పలు పెడుతుంటాడని సునీల్‌ మీద అపవాదు వుంది. ఆఖరుకి దిల్‌ రాజులాంటి ముదురు కూడా సునీల్‌ తాకిడిని తట్టుకోలేక 'కృష్ణాష్టమి' చిత్రాన్ని అతను ఎలా తయారు చేస్తున్నా నోరు మెదపకుండా చూస్తుండిపోయాడట. దిల్‌ రాజు పరిస్థితే అదంటే ఇక చిన్నా చితకా వాళ్ల మాట అసలు వినడు కదా అని గుసగుసలాడుకుంటూ వుంటారు.

ఇదంతా ఏమో కానీ సునీల్‌ నుక తన పని తాను చేసుకుని, దర్శకులు చెప్పినట్టుగా చేసినట్టయితే అతని సినిమాలు ఖచ్చితంగా బెటర్‌గా వుంటాయని అనేవాళ్లు చాలా మందే కనిపిస్తారు. సునీల్‌ గురించి వీళ్లు అనేదాంట్లో నిజమెంత అనేది తెలీదు కానీ ఇండస్ట్రీలో పలువురు హీరోలకి ఇలా ఫింగరింగ్‌ అలవాటు వుందని, ఆ హీరోలతో పని చేసే దర్శకులకి చుక్కలు చూపిస్తుంటారని చెప్పుకుంటూ వుంటారు. స్టార్‌ ఇమేజ్‌ వున్న హీరోలయితే సెట్లో ఇష్టారాజ్యం అయిపోతుందని, అన్నిట్లో వేళ్లు పెట్టడం వల్ల ప్రోడక్ట్‌ దెబ్బ తింటుందని, సినిమా అస్తవ్యస్తంగా తయారై ఫ్లాప్‌ అవుతుందని అంటారు. కేవలం నటించడం మాని సదరు హీరోలకి ఈ కెలుకుడు సరదా ఎందుకో వాళ్లకే తెలియాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు