నరుడా డోనరుడా.. పోయినట్లే పోయి..

నరుడా డోనరుడా.. పోయినట్లే పోయి..

అసలు బాలీవుడ్ హిట్ మూవీ ‘విక్కీ డోనర్’ను సుమంత్ రీమేక్ చేయాల్సిందే కాదట. ఈ సినిమా రీమేక్ హక్కుల విషయంలో ఒక రూమర్నినమ్మేసి.. వేరే కథ కోసం ప్రయత్నించానని.. ఐతే అనుకోకుండా మళ్లీ దీని రీమేక్ ను తనే చేయాల్సి వచ్చిందని అంటున్నాడు సుమంత్.

‘‘నాకు పక్కా కమర్షియల్ సినిమాలు చేయడం నచ్చదు. నాకు సూటయ్యే సినిమా చేద్దామనుకుంటుండగా ‘విక్కీ డోనర్’ కనిపించింది. ఐతే అంతలోనే తాతగారు చనిపోవడంతో కొన్నాళ్లు సినిమా ఆలోచనలు మానుకున్నాను. ఆ గ్యాప్ లో ఎవరో వేరే నిర్మాత ‘విక్కీ డోనర్’ రీమేక్ హక్కులు తీసేసుకున్నట్లు తెలిసింది. దీంతో దాని సంగతి వదిలేసి.. వేరే కొత్త కథలపై దృష్టిపెట్టాను. ఐతే ‘విక్కీ డోనర్’ హక్కులు ఎవరూ తీసుకోలేదని.. నేను విన్నది రూమర్ అని హిందీ వెర్షన్ నిర్మాత జాన్ అబ్రహాంతో మాట్లాడితే తెలిసింది. జాన్ నాకు క్లోజ్ ఫ్రెండ్. నేను అడగ్గానే రీమేక్ రైట్స్ ఇచ్చేశాడు. అలా ఇక లేదు అనుకున్న సినిమా మళ్లీ తెరమీదికి వచ్చింది’’ అని సుమంత్ తెలిపాడు.

ఇక తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి చెబుతూ.. తర్వాతి సినిమా విషయంలో ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని సుమంత్ చెప్పాడు. విలన్ పాత్రలు చేయడమంటే తనకు చాలా ఇష్టమని.. ఈ సంగతి ఎన్నిసార్లు చెబుతున్నా.. ఎవరూ అలాంటి అవకాశాలు ఇవ్వట్లేదని సుమంత్ నిరాశ వ్యక్తం చేశాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English