అమల రేంజ్ ఎలా పడిపోయిందో చూడండి..

అమల రేంజ్ ఎలా పడిపోయిందో చూడండి..

తమిళంలో విజయ్.. విక్రమ్ లాంటి స్టార్ హీరోలతో పని చేసింది అమలా పాల్. తెలుులోనూ రామ్ చరణ్.. అల్లు అర్జున్ లాంటి స్టార్ల పక్కన నటించింది. ఐతే మధ్యలో పెళ్లి కారణంగా ఆమె చాలా అవకాశాలు వదులుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు విజయ్ నుంచి విడిపోయి సింగిల్ అయిపోయినా.. ఆమెకు ఒకప్పట్లాగా అవకాశాలు రావట్లేదు. ఎలాంటి రోల్ అయినా చేయడానికి రెడీ అవుతున్నా సరే.. పెద్ద హీరోల సరసన ఆమెకు ఛాన్సులు దక్కట్లేదు. తెలుగులో రీఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉన్నా ఆమెకు స్టార్ల నుంచి పిలుపు రావట్లేదు. ఐతే స్టార్ల కోసమే ఎదురు చూస్తూ కూర్చుంటే కష్టమని ఆమె కొంచెం దిగొచ్చేసినట్లుంది.

కామెడీ హీరో అల్లరి నరేష్ సరసన ఓ సినిమా చేయబోతోందట అమలా పాల్. 'ఇంట్లో దయ్యం నాకే భయం' తర్వాత నరేష్ 'అలా ఎలా' ఫేమ్ అనిల్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి కమిటైన సంగతి తెలిసిందే. ఆ సినిమాకు అమలను హీరోయిన్ గా ఫైనలైజ్ చేశారట. స్టార్ హీరోల సరసన చేసిన అమల.. అల్లరి నరేష్ లాంటి చిన్న.. సరైన ఫాంలో లేని హీరో పక్కన నటించడానికి ఒప్పుకోవడం విశేషమే. ఐతే పెళ్లయి.. డైవర్స్ తీసుకున్న హీరోయిన్లకు ఈ మాత్రం అవకాశాలు రావడం కూడా కష్టమే. విశేషం ఏంటంటే.. అమలా చేయబోయే సినిమా ఆమె మాతృభాష నుంచి వస్తున్నదే. మలయాళంలో హిట్టయిన 'ఒరు వడక్కం సెల్ఫీ' సినిమానే నరేష్ తో రీమేక్ చేస్తున్నాడు అనిల్ కృష్ణ.

Also Read:


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు