ఎక్కువ చెయ్యకు తాప్సీ

ఎక్కువ చెయ్యకు తాప్సీ

ఒక హిట్‌ వచ్చిందంటే చాలు... మన హీరోయిన్లని పట్టుకోలేమిక. నిన్న మొన్నటి వరకు ఏమి చేస్తుందో కూడా తెలియని తాప్సీ గురించి 'పింక్‌' తర్వాత కాస్త మాట్లాడుకుంటున్నారు. పింక్‌ సక్సెస్‌ అవడంతో తాప్సీకి నోరొచ్చింది. తన సెలబ్రిటీ స్టాటస్‌ని వాడుకుని జనాలకి క్లాసులు పీకవచ్చని ఫీలవుతోంది. దీపావళి రోజున జరిగే కాలుష్యాన్ని చూస్తే తనకి కన్నీళ్లు ఆగడం లేదట. నిజమైన దీపావళి అంటే ఇదేనా అంటూ రెచ్చిపోబోయింది. అయితే మన జనాలకి ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచడం బాగా తెలుసు కదా. తాప్సీ ఈ కామెంట్లు చేయగానే వెంటనే తగులుకుని కాస్త గట్టిగానే క్లాసు పీకారు.

ఏదో ఒక హిట్‌ వచ్చిందని పెద్ద సెలబ్రిటీలా ఫీలయిపోకు అంటూ మందలించారు. రోజూ జరిగే వాహన కాలుష్యంతో పోలిస్తే దీపావళికి జరిగేది ఎక్కువేం కాదని, పర్యావరణం మీద అంత శ్రద్ధ, ప్రేమ ఉన్నట్టయితే కార్లు మానేసి నడిచి తిరగమని, లేదా పబ్లిక్‌ వాహనాలని వాడమని సలహాలిచ్చారు. దీంతో కొందరు ఫాలోవర్స్‌తో తాప్సీ వాగ్వాదానికి కూడా దిగింది. సెలబ్రిటీలం కనుక సమాజం గురించి మాట్లాడాలంటూ భావించే నటీనటులు ఇలాంటి సెన్సిటివ్‌ విషయాల్లో వేళ్లు పెట్టకపోవడమే మంచిది. అసలే ఇప్పటి జనం ఇలాంటి భారీ స్టేట్‌మెంట్లకి పడిపోవడం లేదు సరి కదా... సెలబ్రిటీలని కూడా చూడకుండా వేసేసుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు