మళ్లీ గౌతమ్-నాని కాంబినేషన్?

మళ్లీ గౌతమ్-నాని కాంబినేషన్?

ఒక కథను తమిళంలో ఒక హీరోతో.. తెలుగులో మరో హీరోతో సమాంతరంగా తెరకెక్కించడం గౌతమ్ మీనన్ శైలి. ఏమాయ చేసావె, ఎటో వెళ్లిపోయింది మనసు, సాహసం శ్వాసగా సాగిపో లాంటి సినిమాల్ని అలాగే తెరకెక్కించాడు. ఇప్పుడు మరోసారి గౌతమ్ ఆ తరహాలోనే ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఆ సినిమాకు తెలుగులో నానిని హీరోగా అనుకుంటున్నట్లు సమాచారం. తమిళ వెర్షన్ సంగతి ఇంకా తేలలేదు. గౌతమ్ ఇంతకుముందు నానితో ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఓకే అయితే.. చైతూ తర్వాత గౌతమ్ రెండో సారి పని చేసిన తెలుగు హీరో నాని అవుతాడు.

‘సాహసం శ్వాసగా సాగిపో’ పూర్తి చేశాక గౌతమ్.. ధనుష్ హీరోగా ఓ సినిమా చేశాడు. ఆ చిత్రం మూడే నెలల్లో పూర్తయిపోయింది. ఈ సినిమాను తెలుగులోకి కూడా డబ్ చేసి రిలీజ్ చేస్తారట. దీని తర్వాత గౌతమ్ కు కమిట్మెంట్లు చాలానే ఉన్నాయి. మన రామ్ చరణ్ తో డైరెక్ట్ తెలుగు మూవీ కూడా ఒకటి చేయాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు ఓకే కాలేదు. ఇంతలో నానితో సినిమా తెరమీదికి వచ్చింది. ప్రస్తుతం త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో ‘నేను లోకల్’ చేస్తున్న నాని.. దీని తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఓ సినిమాకు కమిటయ్యాడు. మరి గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఎప్పుడు సెట్స్ మీదికి వెళ్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English