కోన వెంకట్ వచ్చాడండీ..

కోన వెంకట్ వచ్చాడండీ..

ఎట్టకేలకు అక్కినేని నాగచైతన్య సినిమా ‘సాహసం శ్వాసగా సాగిపో’ విడుదల తేదీ కన్ఫమ్ అయిపోయింద. నవంబరు 11నే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చేస్తోంది. ఐతే ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్.. దీని సమర్పకుడు కోన వెంకట్ నుంచి రాలేదు. ఇప్పుడనే కాదు.. దాదాపు రెండు నెలలుగా అసలు ఈ సినిమా గురించి ఆయనేమీ మాట్లాడట్లేదు. అసలీ ప్రాజెక్టుతో తనకేం సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తూ వచ్చాడు కోన.

ఈ మధ్యే దీని నిర్మాతగా రవీందర్ రెడ్డి అనే వ్యక్తి పేరు తెరమీదికి వచ్చింది. మరోవైపు ‘సాహసం శ్వాసగా సాగిపో’ థియేట్రికల్ రైట్స్ రెండు రాష్ట్రాలకు కలిపి అగ్ర నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్నాడు. పరిస్థితి చూస్తే.. కోన ఈ ప్రాజెక్టు నుంచి బయటికి వెళ్లిపోయాడేమో అన్న సందేహాలు కలిగాయి. ఐతే తాజాగా ‘సాహసం శ్వాసగా సాగిపో’ రిలీజ్ డేట్ కన్ఫమ్ చేస్తూ పెట్టిన ప్రెస్ మీట్లో ఉన్నట్లుండి కోన వెంకట్ ప్రత్యక్షమై ఆశ్చర్యపరిచాడు.

ఈ మధ్య కోన ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాడు. ఆయనకు ఫినాన్షియల్ బ్యాకప్ ఇచ్చే ఎంవీవీ సత్యనారాయణ ఒక కేసులో చిక్కుకున్నాడు. దీనికి తోడు కోన ప్రొడ్యూస్ చేసిన సినిమాలు వరుసగా దెబ్బ తింటున్నాయి. ‘శంకరాభరణం’తో పాటు తాజాగా ‘అభినేత్రి’ కూడా కోనను దెబ్బ కొట్టింది. ఈ నేపథ్యంలో ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమా నుంచి కోన బయటకు వచ్చినట్లుగా ప్రచారం జరిగింది. ఐతే ప్రెస్ మీట్‌కు రావడం ద్వారా ఈ ఊహాగానాలకు తెరదించాడు. ఐతే ఈ సినిమాలో కోన భాగస్వామ్యం ఎంతుందో కానీ.. ఆయనకు అత్యవసరంగా ఒక సక్సెస్ అయితే కావాలి. మరి ‘సాహసం..’ ఆయన కోరుకున్న ఫలితాన్నిస్తుందేమో చూద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు