సంక్రాంతి నుంచి సైడైపోయిన నాగ్

సంక్రాంతి నుంచి సైడైపోయిన నాగ్

అక్కినేని నాగార్జున కొత్త సినిమా ‘ఓం నమో వెంకటేశాయ’ను ముందు సంక్రాంతికే అనుకున్నారు. కానీ తర్వాత ఆ ఆలోచనను విరమించుకున్నట్లు కనిపించారు. ఐతే ఈ మధ్య నాగార్జున లైన్లోకి వచ్చి.. అన్నీ కలిసొస్తే సంక్రాంతికే వచ్చేస్తాం అన్నాడు. ఐతే ఇప్పుడు మళ్లీ నిర్ణయం మార్చుకున్నట్లు సమాచారం. ఈ సినిమా సంక్రాంతి రేసు నుంచి తప్పుకుందట. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకొస్తుందట.

‘ఓం నమో వెంకటేశాయ’ ఆలస్యమవుతుండటానికి ప్రధాన కారణం గ్రాఫిక్స్.. విజువల్ ఎఫెక్ట్స్ పనులు ఆలస్యమవుతుండటమే. ‘బాహుబలి’తో తెలుగు సినిమా ప్రమాణాలు బాగా పెరిగిన నేపథ్యంలో గ్రాఫిక్స్.. వీఎఫ్ఎక్స్ విషయంలో రాజీ పడలేమని నాగ్ ఇంతకుముందే చెప్పాడు. అందుకే సినిమా ఆలస్యమైనా పర్వాలేదని ఆ పనులు పక్కాగా ఉండేలా చూసుకుంటున్నారు.

మరోవైపు సంక్రాంతికి పోటీ కూడా తీవ్రంగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ‘ఖైదీ నెంబర్ 150’, నందమూరి బాలకృష్ణ వందో సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ భారీ అంచనాల మధ్య సంక్రాంతికి రాబోతున్నాయి. వాటికి హైప్ మామూలుగా లేదు. వాటితో పోలిస్తే భక్తి రస చిత్రమైన ‘ఓం నమో వెంకటేశాయ’పై బజ్ తక్కువే. అందుకే ప్రతిష్టకు పోయి సంక్రాంతికి విడుదల చేయడం మంచిది కాదని కూడా వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు