మంచు మనోజ్.. గట్టిగానే కొట్టాడు

మంచు మనోజ్.. గట్టిగానే కొట్టాడు

శౌర్య, ఎటాక్ సినిమాల రూపంలో వరుసగా రెండు పెద్ద షాకులే తిన్నాడు మంచు మనోజ్. దీంతో ఈసారి కచ్చితంగా హిట్టు కొట్టాల్సిన స్థితికి చేరాడు. కొంచెం జాగ్రత్తగా రెండు వైవిధ్యమైన సినిమాల్ని లైన్లో పెట్టాడు మంచు వారబ్బాయి. అందులో ఒకటి ‘ఒక్కడు మిగిలాడు’.. ఇంకోటి ‘గుంటూరోడు’. ఈ రెండు సినిమాల ఫస్ట్ లుక్స్‌తో దీపావళి శుభాకాంక్షలు చెప్పాడు మనోజ్. ‘ఒక్కడు మిగిలాడు’లో ఇంటెన్స్ లుక్‌లో రఫ్‌గా కనిపించిన మనోజ్.. ‘గుంటూరోడు’లో ఊర మాస్‌గా తయారయ్యాడు. ఈ రెండు లుక్స్‌తో బలమైన ముద్రే వేశాడు మంచు మనోజ్.

‘ఒక్కడు మిగిలాడు’ సినిమాలో మనోజ్ ఎల్టీటీఈ నాయకుడు ప్రభాకరన్ పాత్రలో కనిపిస్తుండటం విశేషం. తెలుగులో తీవ్రవాదం నేపథ్ంయలో సినిమాలు వచ్చి చాలా కాలమైంది. అందులోనూ ఎల్టీటీఈ నేపథ్యంలో తెలుగులో సినిమా రావడం అంటే ఇంకా అరుదు. తమిళంలో ఓ థ్రిల్లర్ సినిమాతో ఆకట్టుకున్న తెలుగు దర్శకుడు అజయ్ ఆండ్రూస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అచ్చిబాబు నిర్మాత. ఇక ‘గుంటూరోడు’ విషయానికొస్తే ఇందులో ‘కరెంటు తీగ’ తరహాలో మాస్ క్యారెక్టర్ చేస్తున్నాడు మనోజ్. ‘నా రాకుమారుడు’ ఫేమ్ సత్య ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కొన్ని నెలల వ్యవధిలో రిలీజవుతాయి. ముందుగా ‘గుంటూరోడు’ ఈ ఏడాది ఆఖర్లో ప్రేక్షకుల ముందుకు రావచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English