ఈ సారైనా రిలీజ్ పక్కానా?

ఈ సారైనా రిలీజ్ పక్కానా?

పెద్దగా ఆసక్తి లేని సినిమా ఎన్నిసార్లు వాయిదా పడ్డా ఇబ్బంది లేదు. కానీ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కి.. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతుంటే ప్రేక్షకులకు మామూలు అసహనం కలగదు. ‘సాహసం శ్వాసగా సాగిపో’ విషయంలో ఆడియన్స్ అలాంటి ఫ్రస్టేషన్లోనే ఉన్నారు. గత ఏడాది దీపావళికే ఈ సినిమా వచ్చేస్తుందని ప్రచారం జరిగింది. చూస్తుండగానే ఏడాది గడిచిపోయింది. ఈ దీపావళికి కూడా సినిమా విడుదల కాలేదు. ఐతే ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ డేట్ అఫీషియల్‌గా కన్ఫమ్ అయింది. ఈ నెల 11నే చైతూ-గౌతమ్ మీనన్‌ల సినిమా ప్రేక్ష్హకుల ముందుకు వచ్చేస్తోంది.

‘సాహసం శ్వాసగా సాగిపో’ రిలీజ్ డేట్ ప్రోమోలు కూడా రిలీజయ్యాయి. కాబట్టి నవంబరు 11న సినిమా కన్ఫమ్ అయినట్లే. ‘ఏమాయ చేసావె’ తర్వాత చైతూ-గౌతమ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో చైతూ సరసన మలయాళ అమ్మాయి మాంజిమా మోహన్ కథానాయికగా నటించింది. ‘ఏమాయ చేసావె’లోని హీరో పాత్రను తీసుకుని.. దానికి కొత్త కథను జోడించి ఈ సినిమాను తెరకెక్కించాడు గౌతమ్. ‘ఏమాయ చేసావె’ పూర్తి స్థాయి లవ్ స్టోరీ కాగా.. ఇందులో సగం ప్రేమకథ, సగం యాక్షన్ ఉంటుంది. ‘ఏమాయ చేసావె’ తరహాలోనే దీన్ని కూడా తమిళంలో శింబు కథానాయకుడిగా తీశాడు గౌతమ్. ఈ సినిమా ఇంత ఆలస్యం కావడానికి కారణం కూడా శింబునే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు