మంది సొమ్ము మాల్యా దానం

మంది సొమ్ము మాల్యా దానం

అత్త సొమ్ము అల్లుడి దానం అని మన పెద్దవాళ్లు సామెత చెబుతుండేవాళ్లు. బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి దేశం నుంచి పారిపోయిన మాల్యా వ్యవహారశైలి చూస్తుంటే.. పాత ముతక సామెతే గుర్తొస్తోంది. కింగ్ ఫిషర్ ఉద్యోగులకు జీతాలివ్వకుండా పొట్టకొట్టి, బ్యాంకులు అప్పులు చెల్లించకుండా వాటిని ముంచేసి.. దర్జాగా విదేశాలకు చెక్కేసిన లిక్కర్ కింగ్ మాల్యా.. తాను మాత్రం లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. యూకేలో లండన్ సమీపంలో ఉన్న ఫామ్ హౌస్ లో మద్యం, మందుతో ఖుషీగా గడుపుతున్నాడు. దీపావళి సందర్భంగా ఇండియన్ స్నేహితులకు మాల్యా పంపిన గిఫ్ట్ లు చూసి.. అందరూ ముక్కునవేలేసుకుంటున్నారు.

విలాసవంతమైన జీవితం, విందులు, వినోదాలకు లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా పెట్టింది పేరు. భారతీయ బ్యాంకులకు చెల్లించాల్సిన 9 వేల కోట్లకు పైగా రుణం బాపతు సొమ్ము ఎగ్గొట్టి గత మార్చి 2న ఇండియాను పారిపోయిన మాల్యా లండన్‌లో తలదాచుకుంటున్నాడు. అక్కడ కూడా ఆయన విలాసవంతమైన జీవితానికి ఢోకా లేనట్టే కనిపిస్తోంది. కోట్లాది రూపాయల అప్పులు తీర్చడం మాటెలా విలాసవంతమైన జీవితం, తన మిత్రులకు అంతే ఖరీదైన గిప్ట్‌లు పంపడం మాల్యా ఇప్పటికీ మానలేదట. ఈ దీపావళి సందర్భంగా ఆయన తన సన్నిహితులకు ఖరీదైన బహుమతులే పంపారట. యీబీ గ్రూప్ లోగో కూడిన బాక్సుల్లో బ్లాక్ లేబుల్ మద్యం బాటిళ్లను ఆయన పంపించారని మీడియాలో ఫోటోలు హల్చల్ చేస్తున్నాయి. అయితే ఎవరెవరు ఈ గిఫ్టులు అందుకున్నారో, ఆయన సన్నిహితులు ఎవరో అనేది మాత్రం స్పష్టం కాలేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు