తమన్నా ఆ పని చేయదంట..!

తమన్నా ఆ పని చేయదంట..!

గ్లామర్ పాత్రలతోనే కాదు నటనకు ప్రాధాన్యమున్న మూవీస్ తోనూ ఇరగదీస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా.. దీపావళిపై తన అభిప్రాయాలు చెప్పుకొచ్చింది. దీపావళి అంటే ముగ్గుల కేళీ అంటున్న ఈ బ్యూటీ.. టపాసులకు మాత్రం ఆమడ దూరం అంటోంది. శబ్దకాలుష్యం, వాతావరణ కాలుష్యం కలిగించే టపాసులంటే మొదట్నుంచీ తనకు ఇష్టం లేదని చెప్పుకొచ్చింది. స్కూల్ డేస్ నుంచే బాణాసంచాకు దూరంగా ఉన్నానంటోంది తమన్నా. అయితే స్వీట్లు మాత్రం బాగా లాగిస్తానని చెబుతోంది ఈ అవంతిక. తన అభిమానులకు కూడా స్వీట్లు ముద్దు.. టపాసులు వద్దు అని పిలుపునిస్తోంది.

ఈ తరం హీరోయిన్లు సినిమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా తమ ఫ్యాన్స్ కు మంచి విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సినీతారలు చెప్పే మాటలు జనంలోకి బాగా వెళ్తాయన్న అంచనాలకు అనుగుణంగా.. హీరోయిన్లు దాతృత్వ కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. ఇలాంటి గుడ్ విల్  కార్యక్రమాల్లో భాగంగా.. దీపావళి రోజు పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలోపెట్టుకుని.. బాంబులు కాల్చడం మానేయాలని తమన్నా తన అభిమానులకు చెబుతోంది. ప్రకృతిని పరిరక్షించుకోవడానికే పండగలు కానీ.. కాలుష్యాన్ని కొనితెచ్చుకోవడానికి కాదని హితవు చెబుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు