మొబైల్ కింగ్ ఇండియా

మొబైల్ కింగ్ ఇండియా

కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేసిన డిజిటల్ ఇండియా విజయవంతం అవ్వబోతోంది. మొబైల్ సెక్టార్లో యూజర్లు రెచ్చిపోతున్నారు. 2020 నాటికి మొబైల్ వినియోగదారులు దాదాపు 100 కోట్లకు చేరుతారని రీసెంట్ సర్వేలో తేలింది. ది మొబైల్‌ ఎకానమీ: ఇండియా 2016 పేరుతో జీఎస్‌ఎంఏ ఇంటెలిజెన్స్‌ ఈ నివేదికను విడుదల చేసింది. భారత్‌లో మొబైల్ సెక్టార్ అప్రతిహత వేగాన్ని ఈ సర్వే అంచనా వేసింది. ఈ ఏడాది జూన్‌ ఆఖరు నాటికి 61.6 కోట్ల మంది మొబైల్‌ వినియోగదారులతో భారత్‌ ప్రపంచ మొబైల్ మార్కెట్లో రెండో స్థానంలో నిలిచింది.

అలాగే 27.5 కోట్ల స్మార్ట్‌ ఫోన్లతో అమెరికాను అధిగమించి రెండో స్థానానికి చేరుకుంది. 2015 నాటికి భారత జనాభాలో 47 శాతం మంది ఉన్న మొబైల్ వినియోగదారులు 2020 నాటికి 68 శాతానికి పెరగనున్నట్లు నివేదిక పేర్కొంది. ఇందులో 3జీ/4జీ బ్రాడ్‌బాండ్‌ కనెక్షన్లు 67 కోట్లకు చేరతాయి. 4జీ కనెక్షన్లలో పెరుగుదల రేటు చాలా ఎక్కువ ఉంటుంది. మొబైల్ సెక్టార్లో పెట్టుబడులు కూడా పెరుగుతాయని తేల్చారు. మొబైల్ ఆర్థిక రంగం దూసుకుపోతోందని చెప్పింది. డిజిటల్ ఇండియా లక్ష్యాలకు మొబైల్ మార్కెట్ చేయూత ఇస్తుందని సర్వే చెప్పింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు