హీరోగా తనికెళ్ల భరణి

హీరోగా తనికెళ్ల భరణి

తనికెళ్ల భరణి హీరో ఏంటి..? ఆయన్ని హీరోగా పెట్టి సినిమా తీసేదెవరు..? ఇంతకీ ఏంటా కథ..? అని ఆశ్చర్యపోతున్నారా..? ఇక్కడే ఉంది మతలబు. ఆయన హీరో నటిస్తున్న సినిమా ‘నరుడా డోనరుడా’ అట. అదేంటి ఇందులో సుమంత్ కదా హీరో అనిపించొచ్చు. కానీ సుమంత్ దృష్టిలో మాత్రం ఇందులో తనికెళ్ల భరణినే హీరో అట. ఈ మాట చెప్పే ఆయన్ని ఈ సినిమాలో కీలక పాత్రకు ఒప్పించాడట. ఈ సంగతి భరణినే స్వయంగా వెల్లడించాడు.

‘‘నేను అరకు వ్యాలీలో ఒక సినిమా షూటింగులో ఉండగా.. సుమంత్ ఫోన్ చేశాడు. ఓ కథ ఉందని.. అందులో నేనే హీరో అని చెప్పాడు. అదేంటని అడిగితే ‘నరుడా డోనరుడా’ గురించి చెప్పాడు. కథ బాగా నచ్చి ఈ సినిమా చేశాను. ఇందులో నా కెరీర్లో గుర్తుండిపోయే పాత్ర చేశాను’’ అని భరణి తెలిపాడు.

సుమంత్ మాట అతిశయోక్తి ఏమీ కాదు. ‘నరుడా డోనరుడా’లో భరణి చేసింది దాదాపు హీరో లాంటి పాత్రే. ఈ చిత్రం హిందీ సూపర్ హిట్ ‘విక్కీ డోనర్’కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. అందులో అన్ను కపూర్ చేసిన పాత్రను భరణి ఇక్కడ చేస్తున్నాడు. అన్ను ఆ పాత్రకు జాతీయ అవార్డు కూడా అందుకున్నాడు. అన్ను చేసిన ఫెర్టిలిటీ క్లినిక్ నడిపే డాక్టర్ పాత్రను భరణి పోషిస్తున్నాడు. ఎంతో ప్రతిభ ఉన్నా.. దానికి తగ్గ పాత్రలు చేయట్లేదు భరణి. ‘నరుడా డోనరుడా’లో పాత్ర ఆయనకు పర్ఫెక్టుగా సూటవుతుందని.. ఆయన ఈ పాత్రలో అదరగొట్టేసి ఉంటారని భావిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English