ఆ కథ విన్నాక నాగ్‌కు నిద్ర పట్టట్లేదట

ఆ కథ విన్నాక నాగ్‌కు నిద్ర పట్టట్లేదట

మనం.. సోగ్గాడే చిన్నినాయనా.. ఊపిరి.. ఇలా రెండేళ్ల వ్యవధిలో మూడు మరపురాని చిత్రాలు అందించాడు అక్కినేని నాగార్జున. తిరుగులేని ఫామ్‌లో ఉన్న నాగ్.. ప్రస్తుతం ‘ఓం నమో వెంకటేశాయ’ మీద ఫోకస్ పెట్టాడు. ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. ఇక తన తర్వాతి ప్రాజెక్టుపై దృష్టిపెట్టాల్సిన సమయం వచ్చింది. యాంకర్ టర్న్డ్ డైరెక్టర్ ఓంకార్ దర్శకత్వంలో నాగ్ ఓ సినిమా చేస్తాడని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అది ఓ మలయాళ రీమేక్ అన్నట్లుగా చెప్పాడు నాగ్ ఈ మధ్య. అంతకుమించి దీని గురించి అప్ డేట్స్ లేవు.

ఆ సంగతలా ఉంటే.. తాజాగా తన మేనల్లుడు సుమంత్ హీరోగా తెరకెక్కిన ‘నరుడా డోనరుడా’ ఆడియో వేడుకకు అతిథిగా వచ్చిన నాగ్.. తాను ఈ మధ్య ఓ కథ విన్నానని.. అప్పట్నుంచి తనకు నిద్ర పట్టట్లేదని చెప్పాడు. ఈ కథ విషయంలో చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నానని.. ఎప్పుడెప్పుడు సినిమా చేసేద్దామా అనిపిస్తోందని నాగ్ వ్యాఖ్యానించాడు. అది ఓంకార్ చెప్పిన కథేనా.. లేక మరొకటా అన్నది నాగ్ వెల్లడించలేదు. మరోవైపు ఓంకార్ కూడా ఈ మధ్య నాగార్జునకు ఓ కథ చెప్పానని.. ఆయనకు బాగా నచ్చిందని అన్నాడు. మరి ఇద్దరూ మాట్లాడుతున్నది ఒకే కథ గురించి కాదా అన్నది క్లారిటీ లేదు. ఏదేమైనా ఈ మధ్య నాగార్జున ఎంచుకుంటున్న కథలన్నీ చాలా బాగుంటున్నాయి. ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఆయనకు నిద్ర పట్టకుండా చేసిన కథ ఏదో చూద్దాం మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు