పూరీ పులిహోరకి పడేదెవరు?

పూరీ పులిహోరకి పడేదెవరు?

స్టార్ హీరోలతో వరుసపెట్టి సినిమాలు తీసిన పూరి జగన్నాథ్ ఇప్పుడు దొరికిన హీరోతోనే సినిమాలు తీసుకుంటున్నాడు. తను కథ చెప్తే చిరంజీవి, మహేష్ ఇద్దరూ కూడా కాదని, అవునని చెప్పలేదు. పూరి చెప్పిన కథ బాలేదని చిరంజీవి తర్వాత మీడియాతో చెప్తే, అదేదో నాకే చెప్పొచ్చుగా అంటూ అతనికి రోషం పొడుచుకు వచ్చింది. మహేష్కి జనగణమన చెప్తే అతను వినేసి ఏం చెప్పకుండా సైలెంట్ అయిపోయాడట. ఏదీ తేల్చకుండా నా టైమ్ వేస్ట్ చేస్తున్నాడంటూ మహేష్ మీద కూడా గుస్సా అయ్యాడు పూరీ. మరోవైపు ఎన్టీఆర్ కూడా 'ఇజం' రిలీజ్ అయిన దగ్గర్నుంచీ పూరీకి దొరక్కుండా తిరుగుతున్నాడట.

అదే పనిగా పులిహోర కథలు తయారు చేసి, తనకి ఇష్టమొచ్చినట్టు సినిమాలు తీసుకుంటోన్న పూరి జగన్నాథ్తో పని చేయడానికి ఈ టైమ్లో స్టార్ హీరోలు ఆసక్తి చూపించడం లేదు. ఇజం సినిమాకి పెట్టించిన ఖర్చు చూసి ఇక చిన్న హీరోలు కూడా అతనితో సాహసించే అవకాశాల్లేవు. అందుకేనేమో బాలీవుడ్ వెళ్లిపోతానంటూ పూరిజగన్నాథ్ మన హీరోల్ని బెదిరిస్తున్నాడు. బాలీవుడ్లో మాత్రం ఇలా విషయం లేని సినిమాలు జనాల నెత్తిన రుద్దితే ఊరుకుంటారా? కనీసం ఇక్కడైనా పూరి జగన్నాథ్ గత వైభవం దృష్ట్యా ఎవరూ ఏమీ అనడం లేదు కానీ బాలీవుడ్ క్రిటిక్స్ అయితే ఇజం లాంటి సినిమాలకి చమడాలు వలిచేస్తారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు