పవన్ భజన ఆపేలా లేడే..

పవన్ భజన ఆపేలా లేడే..

ఉద్దేశపూర్వకంగా చేయకపోయినా పవన్ కళ్యాణ్.. యువ దర్శకుడు సంపత్ నంది కెరీర్‌తో ఆడుకున్న మాట మాత్రం వాస్తవం. ‘రచ్చ’ లాంటి సూపర్ హిట్ తర్వాత బోలెడన్ని ఆఫర్లు వస్తున్నా వాటన్నింటినీ కాదని పవన్ పిలుపు మేరకు ‘గబ్బర్ సింగ్-2’ మీద పని చేశాడు సంపత్. రెండేళ్ల పాటు ఆ సినిమా కోసం కష్టపడితే చివరికి పవన్‌కు అతడి మీద నమ్మకం కుదరకు తప్పించేశాడు. ఈ రెండేళ్ల కష్టానికి తగ్గట్లు డబ్బులిస్తే ఇచ్చి ఉండొచ్చు కానీ.. సంపత్‌కు జరిగిన డ్యామేజ్ మాత్రం అలాంటిలాంటిది కాదు.

ఒక సూపర్ హిట్ తర్వాత కూడా తనేంటో రుజువు చేసుకోవాల్సిన పరిస్థితిలో పడ్డాడు. పవన్ వల్ల ఎంత దెబ్బ తిన్నా.. తన తర్వాతి సినిమా ‘బెంగాల్ టైగర్’లో పవన్ భజన ఓ రేంజిలో చేశాడు సంపత్. ఈ సినిమా ప్రమోషన్ల టైంలో కూడా పవన్ గురించి చాలా పాజిటివ్‌గా మాట్లాడాడు సంపత్. మళ్లీ పవన్‌తో సినిమా చేస్తానన్న ధీమా కూడా వ్యక్తం చేశాడు. గోపీచంద్‌తో చేస్తున్న తన కొత్త సినిమా విషయంలోనూ సంపత్ పవన్ భజన ఆపేలా కనిపించట్లేదు.

ఈ సినిమాకు ‘ఆరడుగుల బుల్లెట్’ అనే టైటిల్ అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మాట పవన్ సినిమా ‘అత్తారింటికి దారేది’లో ఓ పాట నుంచి పుట్టింది. బాగా పాపులర్ అయింది. ఈ టైటిల్‌ను మెగా హీరో వరుణ్ తేజ్‌ కోసం వాడుకుంటారని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ అలా ఏమీ జరగలేదు. ఐతే ఇప్పుడు సంపత్ నంది తన సినిమా కోసం ఆ టైటిల్ తీసుకుంటున్నట్లు సమాచారం. దీంతో పాటు సినిమాలో కూడా పవన్ రెఫరెన్సులు లేకుండా పోవు. మరి ఈ స్థాయిలో పవన్‌ను నెత్తికెత్తుకుంటున్న సంపత్‌కు తన ఆరాధ్య హీరోతో పని చేసే అవకాశం ఎప్పటికి దక్కుతుందో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English