రాజమౌళిని మంచు లక్ష్మి తిట్టేసిందట

రాజమౌళిని మంచు లక్ష్మి తిట్టేసిందట

‘బాహుబ‌లి’లో శివ‌గామి పాత్ర‌కు అతిలోక సుంద‌రి శ్రీదేవిని రాజ‌మౌళి అడిగాడ‌ని తెలుసు. ఈ విష‌యం రాజ‌మౌళి కూడా ఒప్పుకున్నాడు. త‌ర్వాత ట‌బును కూడా ఓ ద‌శ‌లో క‌న్సిడ‌ర్ చేసిన‌ట్లు వార్త‌లొచ్చాయి. అందులో వాస్త‌వ‌మెంతో తెలియ‌దు. కానీ ఈ పాత్ర‌కు త‌న‌ను కూడా రాజ‌మౌళి సంప్ర‌దించాడంటూ కొత్త విషయం చెప్పింది మంచు ల‌క్ష్మీప్ర‌స‌న్న‌. ఆలీ హోస్ట్ చేసే ఒక టీవీ ఛానెల్ కార్య‌క్ర‌మంలో మంచు ల‌క్ష్మి ఈ విష‌యాన్ని ధ్రువీక‌రించింది. శివ‌గామి పాత్ర‌కు మిమ్మ‌ల్ని అడిగార‌ట నిజ‌మా అని అడిగితే.. అది రూమ‌ర్ కాద‌ని వాస్త‌వ‌మ‌ని చెప్పింది ల‌క్ష్మి. మ‌రి ఆ పాత్ర‌ను ఆమె ఎందుకు కాదందో త‌న మాట‌ల్లోనే తెలుసుకుందాం ప‌దండి.

‘‘శివ‌గామి పాత్ర‌కు న‌న్ను అడ‌గ‌డం రూమ‌ర్ కాదు. నిజమే. రాఘ‌వేంద్ర‌రావుగారి అబ్బాయి ప్ర‌కాష్ నాకు ఫోన్ చేసి ఆ పాత్ర ఆఫ‌ర్ చేశాడు. ఐతే వెంట‌నే నో చెప్పాను. శివ‌గామి పాత్ర న‌చ్చ‌క ఇలా చెప్ప‌లేదు. ప్ర‌భాస్ కు అమ్మ‌గా న‌టించ‌డం అనే ఆలోచ‌న నాకు న‌చ్చ‌లేదు. ఆ ఆలోచ‌నే ఊహించ‌లేను. సినిమాలో నాకు అమ్మ ఫీలింగ్ కాకుండా ఇంకో ఫీలింగ్ వ‌స్తే క‌ష్టం. ప్ర‌కాష్ కు నో చెబుతూ రాజ‌మౌళిని కూడా రెండు మాట‌లు అన్నాను. న‌న్ను ప్ర‌భాస్ అమ్మ‌గా ఎలా ఊహించుకున్నారో అని. ఐతే నా కంటే ముందు శ్రీదేవి.. ట‌బుల‌ను కూడా ఈ పాత్ర‌కు అడిగార‌ట‌. వాళ్ల లీగ్ లో న‌న్ను చేర్చినందుకు చాలా హ్యాపీ. రాజ‌మౌళి గారు ఇంకేదైనా పాత్ర ఆఫ‌ర్ చేస్తే నేను త‌ప్పకుండా చేస్తాను. ఐతే శివ‌గామి పాత్ర‌కు నా వాయిస్ ఉండుంటే వేరేగా ఉండేది. న‌న్ను కేవ‌లం వాయిస్ ఇవ్వ‌మంటే మాత్రం ఇచ్చేదాన్ని. కానీ ప్ర‌భాస్ త‌ల్లిగా నటించ‌డం మాత్రం నా వ‌ల్ల కాదు’’అని ల‌క్ష్మి చెప్పింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు