తమిళంలో కంటే తెలుగులోనే బిగ్ రిలీజ్

తమిళంలో కంటే తెలుగులోనే బిగ్ రిలీజ్

దసరాకు ఏకంగా ఐదు సినిమాలు రిలీజయ్యాయి. కానీ దీపావళికి పెద్దగా సందడి లేదు. మంచు లక్ష్మి సినిమా ‘లక్ష్మీబాంబు’ మినహా చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేవు. ఐతే దీపావళి పండగను చాలా ప్రత్యేకంగా భావించే తమిళ జనాలు మాత్రం రెండు సినిమాలతో రెడీ అయిపోయారు. ఆ రెండు సినిమాలూ తెలుగులోనూ రిలీజవుతున్నాయి. అందులో ఒకటి కాష్మోరా అయితే.. ఇంకోటి ధర్మయోగి (తమిళంలో కోడి). వీటిలో కార్తి సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా ఫస్ట్ లుక్, ట్రైలర్ చూశాక అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. మధ్యలో తెలుగులో కార్తి మార్కెట్ దెబ్బ తిన్నప్పటికీ ‘ఊపిరి’ సినిమాతో మళ్లీ పుంజుకున్నాడు.

పైగా ‘కాష్మోరా’ ట్రైలర్ బాగా ఆసక్తి రేకెత్తించడంతో తెలుగులో ఈ చిత్రం భారీగానే రిలీజవుతోంది. ఎంత భారీగా అంటే.. తమిళంలో కంటే తెలుగులోనే ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. తమిళనాట ధనుష్ సినిమా ‘కోడి’ నుంచి పోటీ ఉండటంతో ఈ చిత్రానికి 450 స్క్రీన్లే దక్కాయి. ఐతే తెలుగులో ఇదే దీపావళి లీడర్. 600 స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నారు. మగధీర, యుగానికి ఒక్కడు, బాహుబలి తరహాలో చారిత్రక నేపథ్యంలో రూ.60 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించారు. పీవీపీ సంస్థ నిర్మించిన ఈ చిత్రాన్ని యువ దర్శకుడు గోకుల్ రూపొందించాడు. కార్తి ఇందులో మూడు రకాల పాత్రలు పోషించడం విశేషం. ముఖ్యంగా యుద్ధ వీరుడిగా గుండుతో ఉన్న క్యారెక్టర్ ఆసక్తి రేకెత్తిస్తోంది. నయనతార, దివ్యశ్రీ హీరోయిన్లుగా నటించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English