రాజమౌళి అలా ఉలిక్కిపడ్డాడేంటి?

రాజమౌళి అలా ఉలిక్కిపడ్డాడేంటి?

బాలీవుడ్ అగ్ర దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్‌కు, యాక్షన్ హీరో అజయ్ దేవగణ్‌కు ఎక్కడ తేడా కొట్టిందో తెలియదు కానీ.. వీళ్లిద్దరూ బద్ధ శత్రువుల్లాగా మారిపోయారు ఈ మధ్య. ఈ దెబ్బకు బెస్ట్ ఫ్రెండ్స్ అయిన కరణ్, కాజోల్‌ల మధ్య కూడా దూరం పెరిగిపోయింది. దీపావళికి కరణ్ సినిమా 'యే దిల్ హై ముష్కిల్'తో పోటీ పడబోయే తన సినిమా 'శివాయ్'కు వ్యతిరేకంగా డబ్బులిచ్చి ప్రచారం చేయిస్తున్నారంటూ అజయ్ ఈ మధ్య కరణ్ మీద పరోక్షంగా సంచలన ఆరోపణలు చేశాడు. ఇంకా కరణ్ మీద వేరే విమర్శలు కూడా చేశాడు అజయ్. దీంతో అతడిపై కరణ్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నాడు.

ఇదిలా ఉంటే.. 'బాహుబలి' ప్రమోషన్ల కోసం ముంబయి వెళ్లిన రాజమౌళి దగ్గర మీడియావాళ్లు. అజయ్ దేవగణ్ ప్రస్తావన తెచ్చారు. మీ గత సినిమా 'మక్కీ' (ఈగ)కు అజయ్ దేవగణ్ పార్ట్‌నర్ కదా.. ఆయన్ని కాదని 'బాహుబలి'ని కరణ్ జోహార్ చేతిలో ఎందుకు పెట్టారు అని ప్రశ్నించారు. ఆ ప్రశ్నతో రాజమౌళి దాదాపు ఉలిక్కిపడ్డాడు. ''ఆగండాగండి. నా మక్కీ సినిమాకు అజయ్ భాగస్వామి కాదు. ఆయనకు ఆ సినిమా నచ్చి ఒక గుడ్‌విల్ గెశ్చర్ తరహాలో దానికి వాయిస్ ఓవర్ ఇచ్చారంతే. అంతకుమించి ఆ సినిమాతో ఆయనతో వ్యాపార లావాదేవీలేమీ జరగలేదు. ఐతే 'బాహుబలి' విషయంలో మేమే కరణ్‌ను సంప్రదించాం. ఇందులో ఆయన పార్ట్‌నర్. నాకు వ్యక్తిగతంగా అజయ్, కరణ్ ఇద్దరితోనూ మంచి సంబంధాలున్నాయి. దీపావళికి రాబోయే వాళ్లిద్దరి సినిమాలూ చూస్తాను'' అని రాజమౌళి తెలిపాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు