చిరంజీవిని అలా క్యాష్‌ చేసేసుకుంటున్నారేంటి?

చిరంజీవిని అలా క్యాష్‌ చేసేసుకుంటున్నారేంటి?

'ఖైదీ నంబర్‌ 150' చిత్రాన్ని కొనడానికి బయ్యర్లు ఏమాత్రం వెనకాడడం లేదు. ఇటీవల వచ్చిన భారీ చిత్రాలకి తీసిపోని రేట్లకి ఈ చిత్రం బిజినెస్‌ జరుగుతోంది. ప్రస్తుతం జరుగుతోన్న బిజినెస్‌ ఆధారంగా చూస్తే, కనీసం డెబ్బయ్‌ కోట్ల వరకు ఈ చిత్రం అమ్ముడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే అంతటి వసూళ్లు తిరిగి రావాలంటే సినిమా ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్‌ అవ్వాలి. ఏమాత్రం తేడా అయినా కానీ సర్దార్‌ గబ్బర్‌సింగ్‌, బ్రహ్మూెత్సవం చిత్రాలకి ఏం జరిగిందో చూసాం కదా. ఇదంతా తెలిసినా కానీ ఖైదీ నంబర్‌ 150 నిర్మాత రామ్‌ చరణ్‌ ఈ చిత్రాన్ని భారీ రేట్లకి అమ్మేస్తున్నాడు.
ఆఫర్లు వస్తున్నాయి కదా అన్నట్టు అడిగినంతకి ఇచ్చేస్తున్నాడు.

వైజాగ్‌ ఏరియాలో దీనికి ఎనిమిది కోట్లకి పైగా చెల్లించారట. తెలుగు సినిమా చరిత్రలోనే ఈ ఏరియాకి సంబంధించి ఇది అతి పెద్ద మొత్తం అంటున్నారంటే చూసుకోండిక. ఇంత రేట్లకి అమ్మేస్తే, రేపు సినిమా అంచనాలకి తగ్గట్టు లేకపోతే పరిస్థితి ఏమవుతుంది? అసలే రాజకీయ ప్రస్థానం తర్వాత చిరంజీవి సినిమా రంగంలోను ఫెయిలైతే ట్రోల్‌ చేసేయాలని చాలా మంది కాసుకుని కూర్చున్నారు. ఇలాంటి టైమ్‌లో సేఫ్‌ గేమ్‌ ఆడకుండా, క్యాష్‌ చేసేసుకోవడం పట్ల కొందరు సీనియర్‌ అభిమానులు సైతం నసుక్కుంటున్నారు. మరి ఈ రేంజ్‌ బిజినెస్‌కి తగ్గ రిటర్న్స్‌ రాబట్టే సీన్‌ ఖైదీ నంబర్‌ 150కి ఉందా? సంక్రాంతికి తెలుస్తుందా సంగతి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English