పవన్ కళ్యాణ్ సినిమాకు తమన్..?

పవన్ కళ్యాణ్ సినిమాకు తమన్..?

ప్రతి హీరో ఒక్కో టైంలో ఒక్క సంగీత దర్శకుడిని ప్రిఫర్ చేస్తుంటాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పుడు ఎక్కువగా రమణ గోగులతో పని చేసేవాడు. ఆ తర్వాత మణిశర్మతో కొన్ని సినిమాలు చేశాడు. ఆపై ఎక్కువ సినిమాలు చేసింది దేవిశ్రీ ప్రసాద్‌తోనే. గత ఏడాదే అనూప్ రూబెన్స్‌తో తొలిసారి ‘గోపాల గోపాల’కు వర్క్ చేశాడు. ఇప్పుడు అనూప్ రూబెన్స్‌తోనే ‘కాటమరాయుడు’ చేస్తున్నాడు పవన్. ఐతే ఇప్పటిదాకా పవన్.. ఒక స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌కు మాత్రం అవకాశం ఇవ్వలేదు. అతనే తమన్. ఐతే తమన్ కూడా త్వరలోనే పవన్‌తో వర్క్ చేయబోతున్నట్లు సమాచారం.

తమిళంలో ‘జిల్లా’ లాంటి బ్లాక్‌బస్టర్ తీసిన టీఎన్ నీశన్ దర్శకత్వంలో ఎ.ఎం.రత్నం నిర్మాణంలో పవన్ ఓ సినిమాకుకమిటైన సంగతి తెలిసిందే. ఈ మధ్యే ఆ సినిమా ప్రారంభోత్సవం కూడా జరుపుకుంది. ఐతే రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో తెలియదు కానీ.. ఈలోపు నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపికపై దృష్టిపెట్టారు. ఈ సినిమాకు నయనతారను హీరోయిన్‌గా అనుకుంటుండగా.. తమన్‌ను సంగీత దర్శకుడిగా సెలక్ట్ చేసినట్లు సమాచారం. తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోలతోనూ పని చేసిన తమన్‌కు తొలిసారి పవన్‌తో చేసే ఛాన్స్ దక్కుతోంది. మరి ఆ అవకాశాన్ని తమన్ ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటాడో... ఎలాంటి ఔట్ పుట్ ఇస్తాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు