పారిపోతున్నారు బాస్‌!!!

పారిపోతున్నారు బాస్‌!!!

టాలీవుడ్‌లోకి ఇద్దరు దర్శకులు ఏదో అల్లాటప్పాగా టైమ్‌ పాస్‌ చేద్దామని రాలేదు. మహేష్‌ బాబు ముంబయ్‌ ఏం చేద్దామని వెళ్ళాడో వాళ్ళుకూడా టాలీవుడ్‌కు అందుకే వచ్చారట. అయితే వాళ్ళనుకున్న పని ఎంతవరకు జరుగుతుందో తెలియదు కాని, జనాలు మాత్రం వాళ్ళ పేరుచెబితేనే పారిపోతున్నారు.

ఈపాటికే మీకు తెలిసిపోయివుంటుంది వాళ్ళెవరో.. సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ, ప్రొడ్యూసర్లను ట్రాప్‌ చెయ్యడంలో నిష్ణాతుడైన మెహర్‌ రమేష్‌ పేరు చెబితే ఇప్పుడు టాలీవుడ్‌ నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు ఎకరాలు ఎకరాలు తడిసిపోతోంది. వీళ్ళతో సినిమా తీసినా, వీళ్ల సినిమాను పంపిణీ చేసినా, ఖచ్చితంగా కాశి వెళ్ళిరావల్సి ఉంటుందని ప్రేక్షకులు చెవులు కొరుక్కుంటున్నారు. రాము తీసిన హేట్‌ స్టోరి, డిపార్ట్‌మెంట్‌ ఒకెత్తయితే, మెహర్‌ చేతినుండి జాలువారిన శక్తి, షాడో లాంటి సినిమాలు ఇట్టే జనాలకు జ్వరం తెప్పిస్తాయి.

బాస్‌ వింటున్నారా? మీ పేరు చెబితే అందరూ పారిపోతున్నారు. మరిప్పుడు ఏం చేస్తారు? బ్లాక్‌బస్టర్‌ తీసి ప్రూవ్‌ చేసుకుంటారా లేకపోతే కామ్‌గా బ్యాక్‌ అయిపోతారా...

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English