‘ఇజం’ అదరగొట్టిందిగా..

 ‘ఇజం’ అదరగొట్టిందిగా..

నిన్నే భారీ అంచనాల మధ్య రిలీజైంది ‘ఇజం’ సినిమా. నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్లోనే మరే సినిమాకూ ఇంత హైప్ రాలేదు. ఏ సినిమా కూడా ఇంత భారీగా రిలీజ్ కాలేదు. ఈ చిత్రానికి ఓపెనింగ్స్ కూడా ఆ హైప్ కు తగ్గట్లే వచ్చాయి. తొలి రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్ రూ.3.5 కోట్ల దాకా షేర్ కలెక్ట్ చేయడం విశేషం. కళ్యాణ్ రామ్ రేంజికి ఇది పెద్ద ఫిగరే. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఈ చిత్రం రూ.3 కోట్ల షేర్ రాబట్టింది. నైజాం వరకే కోటి రూపాయల దాకా కొల్లగొట్టింది. ఆంధ్రా.. సీడెడ్ కలిపి 2కోట్ల పైనే వసూలైంది. ఇక ఇతర రాష్ట్రాలు.. ఓవర్సీస్ కలిపితే కోటి దాకా వచ్చింది. ఈ సినిమా తొలి రోజు డివైడ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే.

ముందు నుంచి హైప్ ఉంది కాబట్టి.. టాక్ ఎలా ఉన్నా హౌస్ ఫుల్స్ పడ్డాయి. మరి శని.. ఆదివారాల్లో డివైడ్ టాక్ ను తట్టుకుని ఈ సినిమా ఎలా నిలబడుతుందో చూడాలి. వీకెండ్ అయ్యేసరికి షేర్ రూ.8-9 కోట్ల వరకు రావచ్చేమో. వీకెండ్ తర్వాతి సినిమా ఎలా ఆడుతుందన్నదాన్ని బట్టి బయ్యర్ల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పొచ్చు. ఈ సినిమాకు రూ.20 కోట్ల దాకా బిజినెస్ జరిగినట్లు సమాచారం. మరి ఆ మొత్తం తిరిగి రావాలంటే ‘ఇజం’ కలెక్షన్లు స్టడీగా ఉండాలి. దీపావళి వీకెండ్లో చెప్పుకోదగ్గ తెలుగు సినిమాలు లేవు కానీ.. కార్తి ‘కాష్మోరా’తో పెద్ద ముప్పు పొంచి ఉంది ‘ఇజం’కు. ఆ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే గట్టి దెబ్బ తగిలినట్లే. మరి చూద్దాం ఏమవుతుందో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు