రెజీనా.. ఏంటీ డ్రామా?

రెజీనా.. ఏంటీ డ్రామా?

ఆ మధ్య అల్లు శిరీష్ ఒక రోజు ట్విట్టర్లో అందరినీ ఫూల్స్ చేయాలని చూశాడు. త్వరలోనే నా శ్రీరస్తు శుభమస్తు అంటూ ఒక ట్వీట్ పెట్టడం ఆలస్యం.. త్వరలోనే అతడి పెళ్లి అంటూ వార్తలు పుట్టుకొచ్చేశాయి. కానీ 'శ్రీరస్తు శుభమస్తు" అనేది అతడి కొత్త సినిమా పేరని తర్వాత వెల్లడైంది. మరి ఇప్పుడు రెజీనా కసాండ్రా కూడా ఇలాగే పబ్లిసిటీ కోసం ఏదైనా గిమ్మిక్ చేస్తోందా.. లేక నిజమే మాట్లాడుతోందా అన్నది అర్థం కాలేదు కానీ.. ఈ రోజు ఇన్స్టాగ్రాంలో ఆమె పెట్టిన ఫొటో.. దాని గురించి చేసిన కామెంట్లు సంచలనం రేపాయి.

ఒక అబ్బాయితో ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగించుకున్న ఫొటోను ఇన్ స్టాగ్రాంలో షేర్ చేసింది రెజీనా. అందులో కేవలం చేతులు మాత్రమే కనిపిస్తున్నాయి. దీనికి వెడ్డింగ్ బెల్స్ అనే హ్యాష్ ట్యాక్ జోడించింది రెజీనా. ''గయ్స్.. ఈ శుభ సందర్భంలో నాకు మీ బ్లెస్సింగ్స్ కావాలి. ఇది ఇలా జరిగినందుకు సారీ. ఆ వ్యక్తి ఎవరో మీకు చెప్పాలనుకుంటున్నా. కానీ అందుకు ఇంకొంచెం సమయం పడుతుంది. మీరందరూ అతణ్ని ఎప్పుడెప్పుడు చూస్తారా అని ఎదురు చూస్తున్నా"" అని మెసేజ్ పెట్టింది రెజీనా.

ఐతే ఈ పోస్టు పెట్టిన కాసేపటికే కలకలం రేపడంతో ఆమె దాన్ని డెలీట్ చేసేసింది. కానీ అప్పటికే మీడియాలో రెజీనా ఎంగేజ్మెంట్ అంటూ వార్తలు వచ్చేశాయి. మరి రెజీనా నిజంగా ఎంగేజ్ అయిందా.. లేక ఇది సినిమా పబ్లిసిటీలో భాగమా అన్నది తేలాల్సి ఉంది. నిజంగా రెజీనా ఎంగేజ్మెంట్ అయిపోయి ఉంటే మాత్రం ఇది అందరికీ పెద్ద షాకే. ఇటు తెలుగులో.. అటు తమిళంలో.. మరోవైపు హిందీలో సైతం సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న టైంలో ఆమె పెళ్లికి రెడీ అవుతుందా అన్నది సందేహమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English