సునీల్‌కు ఆ పది నిమాషాలు చాలట

సునీల్‌కు ఆ పది నిమాషాలు చాలట

ప్రస్తుతం సునీల్‌ కూడా ఒక హిట్టు కొట్టాడనే చెప్పాలి. తమిళంలో హిట్టయిన వెట్టయ్‌ సినిమాను తెలుగులో 'తడాఖా' పేరుతో రూపొందించి, నాగ చైతన్య తన ఫస్ట్‌ మాస్‌ హిట్‌ కొడితే, సునీల్‌ కూడా తన మూడో హిట్టు కొట్టాడు. అయితే ఈ సినిమాలు సునీల్‌కు హీరోయిజమ్‌ ఉండేది కేవలం ఆఖరి పది నిమిషాలు కట్‌.

ఎక్కడ డామినేట్‌ చేస్తాడోనని మనోడితో కామెడికాని, డ్యాన్సులు కాని, ఎక్కువ ఫైట్లు కాని చేయించలేదు. తమిళంలో ఉన్నది ఉన్నట్లు తియ్యకుండా నేటివిటీకి తగ్గట్లు మార్చాం అని చెబుతున్న దర్శకుడు కిషోర్‌ (డాలి), ఏ మార్చాడో తెలుసా? సునీల్‌ ఎక్కడా హైలైట్‌ కాకుండా చాలా చోట్ల జాగ్రత్త తీసుకొని, చివరకు క్లయ్‌మ్యాక్స్‌లో కూడా సునీల్‌ రోల్‌ను ట్రిమ్‌ చేశారు. అయితే ఇవన్నీ పట్టించుకోని సునీల్‌ మాత్రం, సినిమాలో తనకు ఎక్కువ నిడివ ఇచ్చినందుకు చైతూను అభినందిస్తున్నట్లు తెలిపాడు.

మనమేమో సునీల్‌ ఇంకో హీరో అనుకుంటుంటే, ఆయన మాత్రం కేలం క్యారక్టర్‌ ఆర్టిస్టుగా బిహేవ్‌  చెయ్యడం విడ్డూరం. ఏది ఏమైనా తన తడాఖాను కేవలం పది నిమిషాల్లో చూపించిన సునీల్‌ను అభినందిద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English