ముందే ‘బాహుబలి’ ఖాతాలో 500 కోట్లు

ముందే ‘బాహుబలి’ ఖాతాలో 500 కోట్లు

హిందీ సినిమాలకు దేశవ్యాప్తంగా మార్కెట్ ఉంటుంది. అందులోనూ ఖాన్‌ల సినిమాలంటే ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. కానీ వాళ్ల సినిమాలు కూడా ఒక రీజనల్ మూవీ ముందు దిగదుడుపే అనిపిస్తున్నాయి. ఆ సినిమా మన ‘బాహుబలి’యే కావడం విశేషం. ఇండియాలో ఇప్పటిదాకా మరే సినిమాకు లేని స్థాయిలో దీనికి బిజినెస్ జరుగుతుండటం విశేషం. ఇంకా విడుదలకు ఆరు నెలలు సమయం ఉండగానే అన్ని ఏరియాల్లోనూ బిజినెస్ ఓ కొలిక్కి వచ్చేయడం.. దాదాపు రూ.500 కోట్లు నిర్మాతల ఖాతాలో పడేలా కనిపిస్తుండటం విశేషం. కేవలం హిందీ.. తమిళం శాటిలైట్ రైట్స్ ద్వారా మాత్రమే ‘బాహుబలి’ రూ.100 కోట్లకు పైగా సంపాదించడం విశేషం. ఇంకా తెలుగు.. మలయాళం రైట్స్ అమ్ముడుపోవాల్సి ఉంది. మొత్తంగా శాటిలైట్ హక్కుల ద్వారా రూ.150 కోట్లు రావడం గ్యారెంటీ.

ఇక థియేట్రికల్ రైట్స్ ద్వారా ఈజీగా రూ.350 కోట్లు వచ్చేలా కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఒక్క నైజాం ఏరియాకే ‘బాహుబలి’ హక్కులు దాదాపు రూ.50 కోట్లు పలికినట్లుగా వార్తలొస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో అన్ని ఏరియాలూ కలిపితే ఓ 70-80 కోట్లు బాహుబలి నిర్మాతల ఖాతాలో పడటం ఖాయం. ఇక ఇండియాలోని మిగతా రాష్ట్రాల్లో.. ఓవర్సీస్ లో తెలుగు వెర్షన్ కనీసం రూ.50-60 కోట్లయినా సంపాదించి పెట్టడం ఖాయం. మొత్తంగా తెలుగు వెర్షన్ మాత్రమే రూ.200 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక హిందీ హక్కులు ఈజీగా రూ.100 కోట్ల మార్కును దాటేస్తాయి. తమిళం.. మలయాళం హక్కులు కలిపితే ఇంకో వంద కోట్ల వరకు వర్కవుట్ కావచ్చు. ఇక ఆడియో.. మర్చండైజ్.. ఇతర హక్కులన్నీ  కలిపితే ఎంత లేదన్నా రూ.50 కోట్లు రావచ్చు. అలా మొత్తంగా విడుదలకు ముందే రూ.500 కోట్ల దాకా ‘బాహుబలి’ నిర్మాతలకు తెచ్చిపెడుతుందని అంచనా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు