త్రివిక్రమ్-ఎన్టీఆర్.. ఛాన్సే లేదు

త్రివిక్రమ్-ఎన్టీఆర్.. ఛాన్సే లేదు

ఓపక్క వక్కంతం వంశీతో ఎన్టీఆర్ చేయాల్సిన సినిమా ఆగిపోయింది. మరోవైపు పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ సినిమా విషయంలో సందేహాలు నెలకొన్నాయి. దీంతో ఎన్టీఆర్-త్రివిక్రమ్ కలిసి ఓ సినిమా చేసేయబోతున్నారంటూ కొన్ని రోజులుగా ప్రచారం నడుస్తోంది. ఈ కాంబినేషన్ గురించి ఎప్పట్నుంచో ఊహాగానాలు నడుస్తున్నాయి కానీ ఇప్పటిదాకా అవి కార్యరూపం దాల్చలేదు. ఐతే 'కాటమరాయుడు' తర్వాత త్రివిక్రమ్ సినిమానే మొదలుపెడతాడనుకున్న పవన్.. అనూహ్యంగా తమిళ దర్శకుడు నీశన్ తో కొత్త సినిమాకు శ్రీకారం చుట్టడంతో అభిమానులు అయోమయంలో పడిపోయారు. త్రివిక్రమ్ సినిమా ఇప్పుడిప్పుడే మొదలు కాదన్న అభిప్రాయానికి వచ్చేశారు.

మరోవైపు పవన్తో సినిమామొదలయ్యే లోపు త్రివిక్రమ్.. ఎన్టీఆర్ తో సినిమా చేస్తాడని.. అందుకోసం ఓ కథ కూడా చెప్పాడని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించాయి. కానీ తాజా సమాచారం ఏంటంటే.. త్రివిక్రమ్-ఎన్టీఆర్ ఇప్పట్లో కలిసి పనిచేసే అవకాశాలు లేవు. త్రివిక్రమ్ దృష్టి పవన్ సినిమా మీదే ఉంది. నీశన్ సినిమా లాంఛనంగా మొదలైనప్పటికీ ముందు త్రివిక్రమ్ సినిమానే పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నాడట. నవంబర్లోనే ఈ చిత్రం ప్రారంభం కూడా అవుతుందట. ముందు 'కాటమరాయుడు' పూర్తి చేసి.. ఆ తర్వాత త్రివిక్రమ్.. నీశన్ల సినిమాల్ని సమాంతరంగా చేయాలని భావిస్తున్నాడట పవన్. వచ్చే ఏడాది పవన్ మొత్తంగా మూడు సినిమాలతో పలకరించబోతున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు