మారుతి.. థియేటర్ ఓనర్.. ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ

మారుతి.. థియేటర్ ఓనర్.. ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ

రామ్ గోపాల్ వర్మ 'నా ఇష్టం' పుస్తకంలో ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఉంటుంది. వర్మ కాలేజీ రోజుల్లో తరచుగా కామయ్య తోపు అనే ప్రాంతంలో ఉండే ఒక థియేటర్కు వెళ్లేవాడట. ఐతే చదువు వదిలేసి రోజూ నీకు థియేటర్లో పనేంటంటూ ఆ థియేటర్ మేనేజర్ వర్మను తెగ తిట్టేవాడట. సీన్ కట్ చేస్తే కొన్నేళ్లకు 'శివ' లాంటి సెన్సేషనల్ మూవీతో దర్శకుడిగా పరిచయమయ్యాడు వర్మ. ఆ సినిమా విజయోత్సవంలో భాగంగా విజయవాడకు వెళ్లి అదే కామయ్య తోపులోని థియేటర్కు వెళ్తే.. ఒకప్పుడు వర్మను తిట్టిపోసిన మేనేజర్ అతణ్ని చూసి షాకైపోయాడట. ఈ అనుభవం గురించి భలేగా రాశాడు వర్మ. సరిగ్గా ఇలాంటి అనుభవమే యువ దర్శకుడు మారుతికి ఎదురైందిప్పుడు.

మారుతి దర్శకుడు కాకముందు యానిమేషన్ ఫీల్డులో పని చేశాడు. దాని కంటే ముందు మచిలీపట్నంలో సైన్ బోర్డులు.. స్టిక్కరింగ్కు సంబంధించిన షాప్ నడిపేవాడు. అప్పట్లో మచిలీపట్నంలోని ఒక థియేటర్లో కొత్తగా ఏ బోర్డు పెట్టాలన్నా.. స్టిక్కరింగ్ పని ఉన్నా మారుతే వెళ్లేవాడట. తనకు సినిమాలంటే పిచ్చి కావడంతో ఆ థియేటర్ ఓనర్ నుంచి ఎప్పుడు పిలుపు వస్తుందా అని ఎదురు చూసేవాడట మారుతి. అలా అప్పుడు ఆ థియేటర్ వైపు వెళ్లడానికే అంతగా ఎదురు చూసిన మారుతి.. అదే థియేటర్ను రీమోడలింగ్ చేసి.. రీఓపెన్ చేయగా.. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెళ్లాడు. అల్లు అరవింద్, దిల్ రాజులతో కలిసి యువి క్రియేషన్స్ వాళ్లు కొన్ని థియేటర్లను ఇటీవలే లీజుకు తీసుకున్నారు. అందులో ఇక్కడ చెప్పుకుంటున్న థియేటర్ కూడా ఉంది. దాన్ని అత్యాధునికంగా రీమోడల్ చేయించి ప్రారంభోత్సవానికి మారుతిని అతిథిగా పిలిచారు. ఆ కార్యక్రమానికి విచ్చేసిన మారుతిని చూసి థియేటర్ యజమాని చాలా ఉద్వేగానికి గురయ్యాడట. ఒకప్పుడు తనే పనిచ్చి ప్రోత్సహించిన కుర్రాడు.. ఇప్పుడు ఇంత పెద్ద దర్శకుడై తన థియేటర్ పున:ప్రారంభ కార్యక్రమానికి రావడం పట్ల ఆయన చాలా సంతోషం వ్యక్తం చేశాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు