సమ్మర్ బొనాంజాకు తెరతీసేది పవనే

సమ్మర్ బొనాంజాకు తెరతీసేది పవనే

ఎట్టకేలకు పవర్ స్టార్ అభిమానుల చింత తీరిపోయింది. పవన్ కళ్యాణ్ మళ్లీ పూర్తి స్థాయిలో సినిమాల మీద దృష్టిపెటాడు. ‘కాటమరాయుడు’ రెగ్యులర్ షూటింగ్‌కు రెగ్యులర్‌గా హాజరవుతున్నాడు. దీంతో పాటు తమిళ దర్శకుడు నీశన్ దర్శకత్వంలోనూ సినిమాను మొదలుపెట్టాడు. అది సెట్స్ మీదికి వెళ్లడానికి ఇంకొంచెం సమయం పట్టొచ్చు. ఈ లోపు ‘కాటమరాయుడు’ను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలని పట్టుదలతో ఉన్నాడు పవన్. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ విషయంలో చివర్లో హడావుడి పడటం వల్ల ఆ సినిమా క్వాలిటీ ఎలా దెబ్బ తిందో అందరికీ తెలిసిందే. ఒకరకంగా ఆ హడావుడే ఈ సినిమా కొంప ముంచింది.

‘కాటమరాయుడు’ విషయంలో అలా కాకుండా చూసుకోవాలనుకుంటున్నాడు పవన్. అందుకే విడుదల విషయంలో హడావుడి లేకుండా పక్కా ప్లానింగ్‌తో రంగంలోకి దిగాడు. ఇప్పుడు జరుగుతున్న స్పీడ్‌లోనూ షూటింగ్ కొనసాగితే ఈ ఏడాది ఆఖరుకు లేదా జనవరికి షూటింగ్ పూర్తయిపోతుందట. ఇంతకుముందు సంక్రాంతికే ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుని.. ఆ తర్వాత మనసు మార్చుకున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం మార్చి 31న విడుదల చేయాలని ఫిక్సయ్యారట. త్వరలోనే రిలీజ్ డేట్ గురించి ప్రకటన కూడా రావచ్చు. ఈ ఏడాది లాగే వచ్చే సమ్మర్లోనూ పవన్, మహేష్, అల్లు అర్జున్‌ల మధ్య పోటీ నెలకొనబోతోంది. మరో విశేషం ఏంటంటే.. అప్పుడు కూడా సమ్మర్ సందడికి శ్రీకారం చుట్టబోయేది పవనే. అతడి సినిమానే అన్నిటికంటే ముందు రిలీజవబోతోంది. మరి ఈ ఏడాది లాగా కాకుండా ఒక బ్లాక్ బస్టర్‌తో సమ్మర్ బొనాంజా మొదలవుతుందని ఆశిద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు