'బాహుబలి-1' జుజుబి అంటున్నరానా

'బాహుబలి-1' జుజుబి అంటున్నరానా

ఇప్పటికే 'బాహుబలి: ది కంక్లూజన్' మీద అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. వాటిని మరింత పెంచేస్తోంది ఆ చిత్ర బృందం. రెండో భాగం ఇంకా గొప్పగా ఉంటుందని.. వార్ సీన్స్, యాక్షన్ సీక్వెన్స్ తొలి భాగంలో కంటే అదిరిపోతాయని కెమెరామన్ సెంథిల్ కుమార్, ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ ఇప్పటికే చెప్పారు. తాజాగా రానా దగ్గుబాటి లైన్లోకి వచ్చాడు. పోరాట సన్నివేశాల కోణంలో చూస్తే.. 'బాహుబలి: ది కంక్లూజన్' ముందు 'బాహుబలి: ది బిగినింగ్' చాలా చిన్నదనేశాడు రానా. 'బాహుబలి-2' మీద ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలున్నాయో తెలుసని.. వాటిని ఈ చిత్రం తప్పకుండా అందుకుంటుందని రానా ధీమా వ్యక్తం చేశాడు.

''బాహుబలి రెండో భాగంలోని పోరాట ఘట్టాలతో పోల్చుకుంటే తొలి భాగం చాలా చిన్నదిగా కనిపిస్తుంది. ఇందులో అద్భుతమైన పోరాట దృశ్యాలున్నాయి. ఆ సన్నివేశాలు చిత్రీకరించేటపుడు నేనే చాలా ఆశ్చర్యానికి గురయ్యాను. ఆ దృశ్యాల్ని తెరమీద చూసినపుడు ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో ఊహించగలను. తొలి చిత్రం కంటే రెండో చిత్రం భారీ స్థాయిలో ఉంటుందని ప్రేక్షకులు భారీ అంచనాలతో ఉంటారు. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని ప్రేక్షకులు ఎంత ఉత్కంఠతో ఉన్నారో మాకు తెలుసు. ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలను తప్పకుండా అందుకుంటుంది బాహుబలి: ది కంక్లూజన్'' అని రానా తెలిపాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు