మంచి సినిమాల దర్శకుడికి పెద్ద కష్టం

మంచి సినిమాల దర్శకుడికి పెద్ద కష్టం

'ఓనమాలు' లాంటి మంచి సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు క్రాంతి మాధవ్. రెండో ప్రయత్నంలో 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' లాంటి మరో మంచి సినిమా అందించాడు క్రాంతి. ఆ తర్వాత విక్టరీ వెంకటేష్.. అక్కినేని నాగార్జున లాంటి పెద్ద హీరోల కోసం ప్రయత్నించాడతను. అవకాశాలు అందినట్లే అందాయి. చివరికి చేజారాయి. దీంతో సునీల్ లాంటి మార్కెట్ దెబ్బ తిన్న హీరోతో సినిమా చేయాల్సి వచ్చింది. ఏదైతేనేం.. చాలా కాన్ఫిడెంట్‌గా సినిమా అయితే మొదలుపెట్టాడు క్రాంతి. కానీ ఆ సినిమా ప్రారంభోత్సవం జరుపుకునే నాటికే సునీల్ మూడు ఫ్లాపులతో ఇబ్బందుల్లో ఉండగా.. రెగ్యులర్ షూటింగ్ మొదలై కొన్ని రోజులు పూర్తయ్యే సమయానికి అతడి ఖాతాలో ఇంకో రెండు ఫ్లాపులు చేరిపోయాయి. రెండు నెలల కిందట 'జక్కన్న'.. ఇప్పుడు 'ఈడు గోల్డ్ ఎహే' నిరాశ పరిచాయి. సునీల్ మార్కెట్ బాగా దెబ్బ తినేసింది. అతడి సినిమాలంటే పాజిటివ్ బజ్ రావడం సంగతటుంచితే.. ముందే నెగెటివ్ ఇంప్రెషన్ పడిపోతోంది.

సునీల్‌కు ఫ్లాపులిచ్చిన దర్శకులతో పోలిస్తే క్రాంతి మాధవ్ భిన్నమైన దర్శకుడు. రొటీన్ మాస్ మసాలా సినిమా అయితే తీసే టైపు కాదతను. ఎంతో కొంత కొత్తదనం చూపిస్తాడని.. సునీల్‌ను కొత్తగా చూపిస్తాడని కొంచెం ఆశలున్నాయి. కాకపోతే సునీల్ గత సినిమాల ప్రభావం దీని మీద బాగా పడుతోంది. క్రాంతి మీద ప్రెజర్ బాగా పెరిగిపోతోంది. వరుసగా రెండు మంచి సినిమాలందించి ప్రశంసలందుకున్న క్రాంతికి ఇది ఇబ్బందికరమైన పరిణామమే. సునీల్ మీద ఉన్న నెగెటివిటీ అంతా ఇప్పుడు క్రాంతిని కూడా చుట్టుకుంటోంది. ఇలాంటి ప్రెజర్ సిచువేషన్లో అతను ఎలాంటి ఔట్ పుట్ ఇస్తాడో చూడాలి మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు