నానీ.. నీ స్పీడు పాడుగానూ

నానీ.. నీ స్పీడు పాడుగానూ

ఒక పక్క స్పీడూ తగ్గట్లేదు.. మరోపక్క క్వాలిటీ కూడా ఉంటోంది. వైవిధ్యం ఉండేలాగానూ చూసుకుంటున్నాడు. నేచురల్ స్టార్ నాని ఇలా ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నాడో ఇండస్ట్రీ జనాలకు అర్థం కావడం లేదు. గత ఏడాదిన్నర వ్యవధిలో నాని సినిమాలు ఐదు వచ్చాయి. ఆ ఐదూ బాగా ఆడాయి. అందులో అత్యధికంగా ఒక సినిమాకు నాని వెచ్చించిన టైం అంటే ఆరు నెలలు. ఆ సినిమా.. భలే భలే మగాడివోయ్. మిగతా నాలుగు సినిమాలు ఇంతకంటే తక్కువ టైంలోనే అయిపోయాయి. ముఖ్యంగా నాని లేటెస్ట్ హిట్ ‘మజ్ను’ అయితే కేవలం 52 వర్కింగ్ డేస్‌లో పూర్తయింది. దీని తర్వాత నాని చేస్తున్న ‘నేను లోకల్’ కూడా ఇదే స్పీడుతో పూర్తయిపోతున్నట్లు సమాచారం.

రెగ్యులర్ షూటింగ్ మొదలైన రెండు నెలల్లోనే ఈ చిత్రం ముగింపు దశకు వచ్చేసినట్లు తెలిసింది. ఇంకా కొన్ని రోజులు మాత్రమే షూటింగ్ చేయాల్సి ఉందట. ఈ నెలాఖరుకల్లా టాకీ పార్ట్ దాదాపుగా పూర్తవుతుందని అంటున్నారు. ‘సినిమా చూపిస్త మావ’ ఫేమ్ త్రినాథ రావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. పక్కా ప్లానింగ్‌తో రంగంలోకి దిగడంతో శరవేగంగా షూటింగ్ పూర్తవుతోంది. డిసెంబరు నెలాఖర్లో క్రిస్మస్ కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. నవంబరు నెలాఖర్లో ఆడియో విడుదల చేయాలని భావిస్తున్నారు. నాని సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్నందిస్తుండటం ఇదే తొలిసారి. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు