స‌మంత గెలిచింది.. చైతూ ఓడిపోయాడు

స‌మంత గెలిచింది.. చైతూ ఓడిపోయాడు

అంతా ఓపెన్ అయిపోయాక ఇక దాప‌రికాలెందుక‌ని భావిస్తున్న‌ట్లున్నారు అక్కినేని నాగ‌చైత‌న్య‌.. స‌మంత‌. ఈ మ‌ధ్యే ఒక‌రి త‌ర్వాత ఒక‌రు మీడియాతో త‌మ ప్రేమ‌-పెళ్లి గురించి ఓపెన్ గా మాట్లాడేశారు క‌దా. ఈ నేప‌థ్యంలోనే సోష‌ల్ మ‌డియామీడియాలో త‌మ ప‌ర్స‌న‌ల్ సంగ‌తుల్ని పంచేసుకుంటున్నారు. తాజాగా ఇద్ద‌రూ క‌లిసి బ్యాడ్మింట‌న్ కోర్టులోకి దిగిన ఫొటో ఒక‌టి స‌మంత ట్విట్ట‌ర్లో షేర్ చేసింది.

నాగ‌చైత‌న్య అవ‌త‌లి కోర్టులో రాకెట్ పట్టుకుని నిల‌బ‌డి ఉంటే.. ఇవ‌త‌లి కోర్టులో స‌మంత కూల‌బ‌డి ఉంది. స‌మంత ప‌క్క‌న విన్న‌ర్ అని.. చైతూ ప‌క్క‌న లూజ‌ర్ అని క్యాప్ష‌న్ పెట్టడం విశేషం. స‌మంత ప‌డుకునే న‌వ్వుతూ ఫొటోకు పోజిస్తోంది. పి.వి.సింధు త‌మ‌కు స్ఫూర్తిగా నిలిచిన టైంలో ఇలా ఆడామంటూ ఈ ఫొటోకు వ్యాఖ్య జోడించింది స‌మంత‌. ప్ర‌స్తుతం ఈ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

ఇంత‌కుముందు చైతూ-స‌మంత క‌లిసి షాపింగ్ చేస్తున్న.. క‌లిసి సినిమా చూస్తున్న ఫొటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేశాయి. ఈ మ‌ధ్యే ఇద్ద‌రూ క‌లిసి జిమ్ చేస్తున్న వీడియో కూడా ఒక‌టి బ‌య‌టికి వ‌చ్చింది. అవ‌న్నీ ఎవ‌రో చాటుగా క్యాప్చ‌ర్ చేసి షేర్ చేసిన‌వి. ఐతే ఇప్పుడు సమంతే స్వ‌యంగా త‌మ ఇద్ద‌రి ఫొటోను షేర్ చేసి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు