ఫ్లాప్ హీరో... ఫ్లాప్ దర్శకుడు

ఫ్లాప్ హీరో... ఫ్లాప్ దర్శకుడు

బ్యాగ్రౌండ్ పెద్దదే అయినా హీరోగా నిలదొక్కుకోలేకపోతున్నాడు అక్కినేని నాగార్జున మేనల్లుడు సుశాంత్. దశాబ్దం నుంచి పోరాడుతున్నా ఇప్పటికీ అతడికి ఒక్క సక్సెస్ కూడా దక్కలేదు. కాళిదాసు.. కరెంట్.. అడ్డా.. లేటెస్టుగా ఆటాడుకుందాం రా.. ఒకదాన్ని మించి ఇంకోటి ఫ్లాపయ్యాయి. సినిమా సినిమాకూ క్వాలిటీ పడిపోతోంది తప్ప.. ఏమీ మెరుగుపడట్లేదు. జి.నాగేశ్వరరెడ్డి లాంటి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కూడా సుశాంత్ ను కాపాడలేకపోయాడు. ఐతే వరుసగా నాలుగు ఫ్లాపులు తిన్నా సుశాంత్ ఏమీ వెనకడుగు వేయట్లేదు. మళ్లీ సొంత బేనర్లో కొత్త సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.

ఈ ఏడాది ఆరంభంలో రాజ్ తరుణ్ హీరోగా ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ అనే సినిమా ఒకటి రిలీజైంది గుర్తుందా..? ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన శ్రీనివాస్ గవిరెడ్డితో సినిమా చేయబోతున్నాడు సుశాంత్. ఈ విషయాన్ని శ్రీనివాసే వెల్లడించాడు. అతను సుశాంత్‌తో చేయబోయేది డైరెక్ట్ మూవీ కాదట. ఓ కన్నడ సినిమాను రీమేక్ చేయనున్నాడట. ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ ఓ కీలక పాత్ర చేస్తాడని.. ఎడుకేషన్ నేపథ్యంలో సాగే ఎంటర్టైనర్ ఇదని వెల్లడించాడు శ్రీనివాస్. నాగేశ్వరరెడ్డి లాంటి హిట్ డైరెక్టర్ తోనూ ఫ్లాప్ ఎదుర్కొన్న సుశాంత్.. తొలి సినిమానే ఫ్లాప్ తీసిన శ్రీనివాస్‌తో ఎలాంటి ఫలితాన్నందుకుంటాడో చూడాలి మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు